IND VS SA: భారత బౌలర్లపై ప్రొటీస్ సఫారీ
భారీ స్కోరు చేసిన దక్షిణాఫ్రికా... రెండో రోజూపూర్తి ఆధిపత్యం... శతకంతో చెలరేగిన ముత్తుసామి
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్ చేసింది. సెనరన్ ముత్తుసామి(206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109) శతకంతో చెలరేగగా.. మార్కో జాన్సెన్(91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/115) నాలుగు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా(2/75), మహమ్మద్ సిరాజ్(2/106), రవీంద్ర జడేజా(2/94) రెండేసి వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 247/6తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు 489 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 25తో ఆటను కొనసాగించిన ముత్తుసామి (109; 206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. తొమ్మిదో స్థానంలో వచ్చిన మార్కో యాన్సెన్ (93; 91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) భారీ ఇన్నింగ్స్ ఆడాడు. కైల్ వెరినె (45; 122 బంతుల్లో) రాణించాడు. తొలి రోజు ట్రిస్టన్ స్టబ్స్ (49), తెంబా బావుమా (41), మార్క్రమ్ (38), రికెల్టన్ (35) పరుగులు చేశారు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, రవీంద్ర జడేజా, సిరాజ్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ఇండియా 6 ఓవర్లు మాత్రమే ఆడింది. ఆట ముగిసే సమయానికి భారత్ 9/0 స్కోరుతో నిలిచింది. యశస్వి జైస్వాల్ (7*), కేఎల్ రాహుల్ (2*) క్రీజులో ఉన్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. భారత బౌలర్ల వైఫల్యం సౌతాఫ్రికాకు కలిసొచ్చింది. భారత బౌలర్ల వైఫల్యంతో ఈ మ్యాచ్ భారత్ చేజారింది. ఒకవేళ భారత బ్యాటర్లు మెరుగ్గా రాణించినా.. మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది.
తొలి రెండు సెషన్లలో దక్షిణాఫ్రికా పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఫస్ట్ సెషన్లో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసిన సఫారీలు.. టీ విరామ సమయానికి 316/6తో నిలిచారు. రెండో సెషన్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు దూకుడుగా ఆడారు. కైల్ వెరినె వికెట్‌ను కోల్పోయినప్పటికీ 112 రన్స్ చేశారు. తర్వాత క్రీజులోకి వచ్చిన యాన్సెన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ముత్తుసామి కూడా జోరు పెంచడంతో 428/7తో సౌతాఫ్రికా లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. ఆఖరి సెషన్ మొదలయ్యాక సెంచరీ హీరో ముత్తుసామిని సిరాజ్ వెనక్కి పంపి 97 పరుగుల భాగస్వామ్యానికి (106 బంతుల్లో) తెరదించాడు. తర్వాత యాన్సెన్ మరింత దూకుడుగా ఆడాడు. జడేజా బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్ బాదాడు. ఈ క్రమంలో హర్మర్ (5)ని బుమ్రా ఔట్ చేశాడు. సెంచరీ చేసేలా కనిపించిన యాన్సెన్‌ను కుల్దీప్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో దక్షిణాఫ్రికా ఆలౌటైంది.