SACHIN: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన రూట్
అత్యధిక పరుగుల రికార్డు నుంచి అత్యధిక సెంచరీల రికార్డు చేసిన సచిన్ టెండూల్కర్;
క్రికెట్ చరిత్రలో రికార్డులను సచిన్ అందుకోని రికార్డు దాదాపు ఏదీ లేదనే చెప్పాలి. అత్యధిక పరుగుల రికార్డు నుంచి అత్యధిక సెంచరీల రికార్డును కూడా ఆయన నెలకొల్పాడు. ఆయన క్రియేట్ చేసిన రికార్డు ఒకటి భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో జో రూట్ బ్రేక్ చేశాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు (1,575) పరుగులు చేసి క్రియేట్ చేసిన రికార్డును జో రూట్ (1,602) అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో 58 బంతుల్లో 28 పరుగులు చేసి సచిన్ పేరుతో ఉన్న రికార్డును తన పేరున లిఖించుకున్నాడు రూట్. జో రూట్ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే అంతకు ముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ టెండూల్కర్ చివరిసారిగా 2011లో ఇంగ్లాండ్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్‌లో 17 మ్యాచ్‌ల్లో 30 ఇన్నింగ్స్‌ల్లో 1575 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జో రూట్ గురించి చెప్పాలంటే.. అతను ఈ మ్యాచ్ లో 2 పరుగులు చేసిన వెంటనే సచిన్‌ను వెనక్కి నెట్టాడు. ఇప్పుడు జో రూట్ ఇంగ్లాండ్‌లో భారత్‌పై 1602 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్‌లో 17 మ్యాచ్‌ల్లో 30 ఇన్నింగ్స్‌ల్లో 1575 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జో రూట్ గురించి చెప్పాలంటే.. అతను ఈ మ్యాచ్ లో 2 పరుగులు చేసిన వెంటనే సచిన్‌ను వెనక్కి నెట్టాడు.