SAINA: రాకెట్ చేత పట్టి..చైనాకే చెక్ పెట్టి..

భారత బ్యాడ్మింటన్ చరిత్ర మార్చిన సైనా... 2008లో జూనియర్ ప్రపంచ ఛాంపియన్.. వరల్డ్ నెంబర్ వన్ గా నిలిచిన స్టార్

Update: 2026-01-20 10:00 GMT

భారత బ్యా­డ్మిం­ట­న్ చరి­త్ర­లో ఓ స్వ­ర్ణ­యు­గా­ని­కి ప్ర­తీ­క­గా ని­లి­చిన పేరు సైనా నె­హ్వా­ల్. అం­త­ర్జా­తీయ వే­ది­క­ల­పై భారత జెం­డా­ను గర్వం­గా ఎగ­ర­వే­సిన తొలి మహి­ళా షట్ల­ర్‌­గా, లక్ష­లా­ది యు­వ­త­కు స్ఫూ­ర్తి­గా ని­లి­చిన క్రీ­డా­కా­రి­ణి ఆమె. చైనా ఆధి­ప­త్యం నడి­చిన కా­లం­లో, ఆ శక్తి­వం­త­మైన వ్య­వ­స్థ­కు గట్టి సవా­ల్ వి­సి­రి ప్ర­పంచ శి­ఖ­రా­ల­కు చే­రిన ధీర వని­త­గా సైనా పేరు చి­ర­స్థా­యి­గా ని­లి­చి­పో­యిం­ది. ఆమె సా­ధిం­చిన ప్ర­తి వి­జ­యం వె­నుక ఉన్న­ది అపా­ర­మైన కష్టం, పట్టు­దల, త్యా­గం. కో­ర్టు­లో ఆమె ఆట మా­త్ర­మే కాదు, భారత మహి­ళా క్రీ­డల ది­శ­ను మా­ర్చిన ఓ వి­ప్ల­వం కూడా. 2008 సం­వ­త్స­రం సైనా నె­హ్వా­ల్ కె­రీ­ర్‌­లో కీలక మలు­పు. అదే ఏడా­ది ప్ర­పంచ జూ­ని­య­ర్ బ్యా­డ్మిం­ట­న్ ఛాం­పి­య­న్‌­గా ని­లి­చి, అం­త­ర్జా­తీయ బ్యా­డ్మిం­ట­న్ వే­ది­క­పై తన సత్తా­ను ప్ర­పం­చా­ని­కి చా­టిం­ది. ఈ వి­జ­యం భారత బ్యా­డ్మిం­ట­న్ చరి­త్ర­లో ఒక మై­లు­రా­యి­గా ని­లి­చిం­ది. అప్ప­టి నుం­చే సైనా పేరు ప్ర­పంచ స్థా­యి షట్ల­ర్ల జా­బి­తా­లో వి­ని­పిం­చ­డం ప్రా­రం­భ­మైం­ది. జూ­ని­య­ర్ స్థా­యి నుం­చి సీ­ని­య­ర్ స్థా­యి­కి మా­రిన తర్వాత కూడా ఆమె ప్ర­ద­ర్శ­న­లో తగ్గు­దల కని­పిం­చ­లే­దు

2009లో సైనా మరో చా­రి­త్రక ఘనత సా­ధిం­చిం­ది. బీ­డ­బ్ల్యూ­ఎ­ఫ్ సూ­ప­ర్ సి­రీ­స్ టై­టి­ల్‌­ను గె­లి­చిన తొలి భారత షట్ల­ర్‌­గా ఆమె రి­కా­ర్డు సృ­ష్టిం­చిం­ది. ఈ వి­జ­యం భారత బ్యా­డ్మిం­ట­న్‌­కు కొ­త్త గు­ర్తిం­పు­ను తీ­సు­కొ­చ్చిం­ది. అదే ఏడా­ది ఇం­డో­నే­సి­యా ఓపె­న్, సిం­గ­పూ­ర్ ఓపె­న్, స్వి­స్ ఓపె­న్ వంటి ప్ర­తి­ష్ఠా­త్మక టో­ర్నీ­ల్లో వి­జ­యా­లు సా­ధి­స్తూ, సైనా అం­త­ర్జా­తీయ సర్క్యూ­ట్‌­లో అగ్ర­శ్రే­ణి ఆట­గా­ళ్ల సరసన ని­లి­చిం­ది. సైనా ఖాతాలో మొత్తం 10 సూపర్ సిరీస్ టైటిళ్లు, 10 గ్రాండ్ ప్రీ టైటిళ్లు ఉన్నాయి. 2014లో జరిగిన ఆసియా క్రీడల్లో సైనా కాంస్య పతకం సాధించింది. ఇది కూడా ఆమె కెరీర్‌లో మరో ముఖ్యమైన ఘట్టం. ఆ తర్వాత 2015 సంవత్సరం సైనాకు అత్యంత ప్రత్యేకమైన సంవత్సరం. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. అదే విధంగా ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో కూడా ఫైనల్‌కు చేరి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. టైటిల్ దక్కకపోయినా, ఈ రెండు ఫైనల్స్ ఆమె స్థాయిని ప్రపంచానికి మరోసారి చాటాయి.

అదే 2015లో సైనా నెహ్వాల్ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఘనత సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానం దక్కించుకొని, ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా షట్లర్‌గా చరిత్ర సృష్టించింది. చైనా, జపాన్, కొరియా వంటి దేశాల ఆధిపత్యం ఉన్న కాలంలో ఈ స్థాయికి చేరడం అనేది అసాధారణ విజయంగా క్రీడా విశ్లేషకులు అభివర్ణించారు. 2017 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సైనా మరోసారి తన పోరాట స్ఫూర్తిని చాటింది. తీవ్ర పోటీ మధ్య కాంస్య పతకం సాధించి, ఇంకా తాను టాప్ స్థాయిలో ఉన్నానని నిరూపించింది. 2018 ఆసియా క్రీడల్లో కూడా కాంస్య పతకం గెలిచి, దేశానికి మరోసారి గౌరవం తీసుకొచ్చింది. అదే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించి, తన ఖాతాలో మొత్తం మూడు స్వర్ణాలు సహా అయిదు కామన్వెల్త్ పతకాలను నమోదు చేసింది.

Tags:    

Similar News