SAINA: ఏడేళ్ల వివాహ బంధానికి సైనా-కశ్యప్ గుడ్ బై

ఇన్‌స్టా పోస్టుతో నిర్ధారించిన సైనా... గోప్యతను గౌరవించాలని సూచన... 2018లో పెళ్లి చేసుకున్న జంట;

Update: 2025-07-15 04:30 GMT

మరో స్టా­ర్ సె­ల­బ్రి­టీ కపు­ల్ వి­డా­కు­లు తీ­సు­కుం­టోం­ది. ప్ర­ముఖ బ్యా­డ్మిం­ట­న్ క్రీ­డా­కా­రి­ణి సైనా నె­హ్వా­ల్, పా­రు­ప­ల్లి కశ్య­ప్ వి­డి­పో­వా­ల­ని ని­ర్ణ­యిం­చు­కు­న్నా­రు. కశ్య­ప్, తాను వి­డా­కు­లు తీ­సు­కుం­టు­న్నా­మ­ని సైనా నె­హ్వా­ల్ తన సో­ష­ల్ మీ­డి­యా­లో ఈ వి­ష­యా­న్ని తె­లి­య­జే­శా­రు. బ్యా­డ్మిం­ట­న్ కో­ర్టు­లో వీ­రి­ద్ద­రి ప్రేమ కథ ప్రా­రం­భ­మైం­ది. వీ­రి­ద్ద­రూ హై­ద­రా­బా­ద్‌­లో­ని పు­ల్లెల గో­పీ­చం­ద్ అకా­డ­మీ­లో కలి­సి శి­క్షణ పొం­దా­రు. అకా­డ­మీ­లో మొ­ద­లైన వీరి పరి­చ­యం స్నే­హం­గా మా­రిం­ది. అది ప్రే­మ­గా మారి పె­ళ్లి­పీ­ట­లె­క్కిం­ది. తమ వి­డా­కుల ప్ర­క­ట­న­తో అభి­మా­ను­ల­కు సైనా, కశ్య­ప్ షా­కి­చ్చా­రు.

పదేళ్లకుపైగా ప్రేమించుకున్న జంట

సైనా, కశ్య­ప్ హై­ద­రా­బా­ద్‌­లో­ని పు­ల్లెల గో­పీ­చం­ద్ అకా­డ­మీ­లో కలి­సి పె­రి­గా­రు. సైనా ఒలిం­పి­క్ కాం­స్యం, వర­ల్డ్ నం­బ­ర్ 1 ర్యాం­కిం­గ్‌­తో గ్లో­బ­ల్ స్టా­ర్‌­గా ఎది­గిం­ది. కశ్య­ప్ కా­మ­న్వె­ల్త్ గే­మ్స్ గో­ల్డ్, అం­త­ర్జా­తీయ స్థా­యి­లో ని­ల­క­డ­గా రా­ణిం­చి తన­కం­టూ ఒక గు­ర్తిం­పు తె­చ్చు­కు­న్నా­డు. పదే­ళ్ళ­కు పైగా ప్రే­మిం­చు­కు­న్న తర్వాత ఈ జంట 2018లో పె­ళ్లి చే­సు­కుం­ది. పా­రు­ప­ల్లి కశ్య­ప్ బ్యా­డ్మిం­ట­న్ నుం­చి రి­టై­ర్ అయిన తర్వాత కో­చిం­గ్‌­లో­కి మా­రా­డు. సైనా కె­రీ­ర్ చి­వ­రి సం­వ­త్స­రా­ల­లో ఆమె­కు కో­చ్‌­గా వ్య­వ­హ­రిం­చా­డు. 2019 నే­ష­న­ల్ ఛాం­పి­య­న్‌­షి­ప్స్‌­లో పీవీ సిం­ధు­ను ఓడిం­చి­న­ప్పు­డు కశ్య­ప్ ఆమె­కు కో­చ్‌­గా ఉన్నా­డు. 2016 తర్వాత సైనా ఎదు­ర్కొ­న్న గా­యాల నుం­చి కో­లు­కో­వ­డా­ని­కి కశ్య­ప్ ఆమె­కు సహా­యం చే­శా­డు. మై­దా­నం­లో, టో­ర్న­మెం­ట్ల­లో కశ్య­ప్ సై­నా­కు వ్యూ­హా­త్మక సల­హా­లు, సపో­ర్ట్ ఇస్తూ కని­పిం­చే­వా­డు. సైనా చి­వ­ర­గా జూన్ 2023లో ప్రొ­ఫె­ష­న­ల్ సర్క్యూ­ట్‌­లో ఆడిం­ది. ఈ ది­గ్గజ షట్ల­ర్ ఇంకా రి­టై­ర్మెం­ట్ ప్ర­క­టిం­చ­లే­దు. కశ్య­ప్ మా­త్రం ఈ ప్ర­క­ట­న­పై ఇంకా స్పం­దిం­చ­లే­దు. కాగా, కశ్య­ప్ మా­త్రం ఇప్ప­టి వరకు దీ­ని­పై స్పం­దిం­చ­లే­దు. సైనా చే­సిన ఈ ప్ర­క­టన ఆమె అభి­మా­ను­ల­ను ఆశ్చ­ర్య­ప­రి­చిం­ది. అకా­డ­మీ­లో శి­క్షణ సమ­యం­లో మొ­ద­లైన సైనా-కశ్య­ప్ స్నే­హం తర్వాత ప్రే­మ­గా మా­రిం­ది.

Tags:    

Similar News