Sania Mirza : ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ : సానియా మిర్జా బిగ్ డిసిషన్..!
Sania Mirza : ఐపీఎల్ తాజాగా ముగిసింది.. ఇప్పుడు క్రికెట్ అభిమానులను మరింతగా ఆకట్టుకోవడానికి టీ20 వరల్డ్ కప్ రెడీ అయిపొయింది..;
Sania Mirza : ఐపీఎల్ తాజాగా ముగిసింది.. ఇప్పుడు క్రికెట్ అభిమానులను మరింతగా ఆకట్టుకోవడానికి టీ20 వరల్డ్ కప్ రెడీ అయిపొయింది.. అందులో భాగంగానే ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య ఈ నెల 24న హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల దేశాలు మాత్రమే కాదు యావత్ ప్రపంచదేశాలు కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.
పాకిస్థాన్ ఇప్పటి వరకు ప్రపంచకప్ మ్యాచ్‌లలో భారత్‌ను ఓడించింది లేదు. ఇందులో ఇండియాదే రికార్డు.. ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య అయిదుసార్లు మ్యాచ్‌లు జరగగా ఇందులో టీమిండియా 4-0 ఆధిక్యంలో ఉంది. మరో మ్యాచ్ రద్దైంది.. దీనితో ఇప్పుడు ఈ మ్యాచ్ పైన అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో టెన్నిస్ స్టార్ సానియా మిర్జా చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.
ఇరు జట్ల మధ్య మ్యాచ్ సమయంలో విషపూరిత వాతావరణాన్ని నివారించేందుకే ఆ రోజు సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టుగా తెలిపింది. మ్యాచ్ సమయంలో ఇరు దేశాల అభిమానులు ఉద్వేగంతో ఉంటారని, అందుకే తాను ఆ రోజు సోషల్‌మీడియా నుంచి మాయమైపోతానని తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో మెసేజ్ షేర్ చేసింది.
గతంలో ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఇరు దేశాల అభిమానులు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో సానియా సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని ఉంటుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా పాక్‌తో తర్వాత టీంఇండియా జట్టు.. అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.