ఓడిపోతున్నానని చేయి కొరికాడు... 'ఇదేం పద్ధతి'?
నిన్న(బుధవారం) టోక్యో ఒలింపిక్స్‌లో జరిగిన రెజ్లింగ్ పోటీలో కజకిస్తాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌ను ఓడించి భారత రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.;
నిన్న(బుధవారం) టోక్యో ఒలింపిక్స్‌లో జరిగిన రెజ్లింగ్ పోటీలో కజకిస్తాన్ రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌ను ఓడించి భారత రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. స్వర్ణం సాధించేందుకు రవికుమార్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా నిన్నటి మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ చివరి దశలో సనయేవ్ ఓడిపోతున్నా అనే బాధలో రవికుమార్ చేతిని కొరకడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదే విషయం పైన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక టీంఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఫైర్ అయ్యాడు. ఇదేం పద్దతి ఎంత ఓడిపోతున్నాననే బాధలో ఉంటే ప్రత్యర్థి చేయి కొరకడం సమంజసం కాదు. ఇది క్రీడా స్పూర్తికి విరుద్ధం. ఒక ఆటగాడిని గౌరవించే పద్దతి ఇదేనా అంటూ ట్వీట్ చేశాడు.. కాగా గురువారం సాయంత్రం రష్యా రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో రవికుమార్ తలపడనున్నాడు. ఈ మ్యాచ్ లో రవికుమార్ గెలిస్తే గోల్డ్ మెడల్, ఓడితే సిల్వర్ మెడల్ వస్తుంది.