Shane Warne : బరువు తగ్గాలి.. 10 రోజుల క్రితమే షెడ్యూల్.. కానీ చివరికి ఇలా!!
Shane Warne : ఈ రోజే, ఈ నిమిషమే మనది.. రేపు మనది కాదు అని తెలిసినా.. భవిష్యత్ ప్రణాళికలు వేసుకోకుండా ఉండలేం.;
Shane Warne : ఈ రోజే, ఈ నిమిషమే మనది.. రేపు మనది కాదు అని తెలిసినా.. భవిష్యత్ ప్రణాళికలు వేసుకోకుండా ఉండలేం. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ కూడా అదే చేశాడు.. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ ఏడాది జూలై నాటికి బరువు తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అంతకుముందు 98 కిలోల బరువు ఉన్నవార్న్.. హెవీ వర్కవుట్లు చేసి 2020లో ఏకంగా14 కిలోల బరువు తగ్గాడు. అయితే మరికొంత తగ్గాలని ప్లాన్ చేసుకున్నాడు.
వార్న్ తన మరణానికి కేవలం నాలుగు రోజుల ముందు ఇలా పోస్ట్ చేసాడు.. "ఆపరేషన్ ష్రెడ్ ప్రారంభమై 10 రోజులు అవుతుంది. జూలై వరకు ఒకప్పటి షేన్ వార్న్‌లా తయారవ్వడమే లక్ష్యం" అని పోస్ట్ చేశాడు. ఫిట్ నెస్ కోసండైట్ మెయింటేన్ చేయడం, అతిగా జిమ్ చేయడం అతని గుండెకు ముప్పు తెచ్చి ఉంటుందని నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది ఫిట్ నెస్ కోసం అతిగా ఎక్సర్‌సైజులు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. వార్న్ మరణానికి కూడా అదే కారణమై ఉండవచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఫిట్ నెస్ కోసం వార్న్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని, బరువు తగ్గించే డ్రగ్స్ వాడుతున్నాడని ఆ మధ్య వార్తలు రాగా వాటిని ఖండించాడు.. బరువు తగ్గడం కోసం సాంప్రదాయ చైనీస్ ఔషధాలను వాడుతున్నానని వార్న్ చెప్పుకొచ్చాడు. భోజనానికి బదులు జ్యూస్‌లు, షేక్స్ తీసుకుంటానని తెలిపాడు. ఇప్పటికే తాను 14 కిలోలు తగ్గానని, 80 కిలోలకు రావడానికి ప్రయత్నిస్తున్నానని గతంలో పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు వార్న్.
Operation shred has started (10 days in) & the goal by July is to get back to this shape from a few years ago ! Let's go 💪🏻👏🏻 #heathy #fitness #feelgoodfriday pic.twitter.com/EokgT2Hyhz
— Shane Warne (@ShaneWarne) February 28, 2022