Shikhar Dhawan: అయేషా ముఖర్జీతో విడాకులు.. శిఖర్ ధావన్ స్పందన
శిఖర్ ధావన్ తన విడాకుల గురించి, అతని వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఆందోళన చెందలేదని తెలుస్తోంది.;
Shikhar Dhawan: శిఖర్ ధావన్ తన విడాకుల గురించి ప్రత్యక్షంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఇష్టపడినందున అతని వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఆందోళన చెందలేదని తెలుస్తోంది.
భారత ఓపెనర్ శిఖర్ ధావన్ భార్య అయేషా ముఖర్జీ ఎనిమిదేళ్ల వివాహం ముగిసిందని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021 లో ఆడుతున్న ధావన్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌తో యుఎఇలో ఉన్నాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్ తన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది. అయేషాతో విడాకుల గురించి ప్రస్తావిస్తూ ఇన్‌స్టాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.
ధావన్ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రహస్య సందేశాన్ని పోస్ట్ చేశాడు. మీ కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తూ ఉండండి అని అయేషాను ఉద్దేశిస్తూ రాసుకొచ్చాడు. జూలైలో శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో ధావన్ భారత జట్టుకు నాయకత్వం వహించాడు.
కాగా, ధావన్‌తో కలిసి ఉండలేనని, విడిపోతున్నానని తెలుపుతూ విడాకుల వార్తలను ప్రకటించడానికి అయేషా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లింది. "నేను డైవర్స్ గురించి ఆలోచించాను, విడాకులు తీసుకోవడం ఇది రెండో సారి. నా జీవితంలో విడాకులు అనే పదం ఒక డర్టీ వర్డ్ అని ఆమె రాసుకొచ్చింది.
అయేషాకు ఆస్ట్రేలియన్ వ్యాపారవేత్తతో అంతకుముందు వివాహం జరిగింది. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతడితో విడిపోయిన తరువాత 2012లో శిఖర్ ధావన్‌ని వివాహం చేసుకుంది. అయేషా కిక్ బాక్సర్. అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగింది.
" నేను విడాకులు తీసుకున్న మొదటిసారి చాలా భయపడ్డాను. వివాహ జీవితంలో విఫలమయ్యాను అందుకే విడాకులు తీసుకున్నాను. కానీ ఆ సమయంలో ఏదో తప్పు చేస్తున్నట్లు అనిపించింది" అని అయేషా పోస్ట్‌లో పేర్కొంది.
శిఖర్ అయేషాలకు 2014లో ఒక బాబు పుట్టాడు. అయితే అయేషాతో విడాకులు తీసుకున్నవిషయంపై శిఖర్ పెద్దగా ఆందోళన చెందడం లేదని తెలుస్తోంది. తాజాగా ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఓ పోస్ట్ పెట్టాడు ' మీ కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడి పనిచేయండి ' అని ధావన్ ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు.