Shreyas Iyer: ఐసీయూ నుంచి బయటకు వచ్చిన శ్రేయస్ అయ్యర్
అనుకున్న దానికంటే పెద్ద గాయం.. అయ్యర్‌కు పక్కటెముకల గాయం.. గాయంతో అంతర్గత రక్తస్రావం
టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్‌లో గాయపడి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నా, వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు. అంతర్గత రక్తస్రావం కారణంగా ఐసీయూలో ఉంచి, ఇప్పుడు సాధారణ వార్డుకు మార్చారు. పూర్తిగా కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. సిడ్నీలోనే ఉన్న అయ్యర్‌ను భారత్‌కు ఎప్పడు తీసుకొస్తారు అనేది స్పష్టత లేదు. రానున్న దక్షిణాఫ్రికా సిరీస్‌కు హాజరయ్యేది కూడా అనుమానమే. అయ్యర్‌కు అనుకున్నదానికంటే పెద్ద గాయమే అయ్యింది. పక్కటెముకల గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం కావడంతో రెండు రోజులు అతడికి ఆసుపత్రిలో ఐసీయూలో లో చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ముందు అనుకున్నట్లు మూడు వారాలు కాక, మరింత కాలం అతడు ఆటకు దూరం కావచ్చు. టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టేటపుడు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. పక్కటెముక గాయం కారణంగా వెంటనే గ్రౌండ్ వీడిన శ్రేయాస్ డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వచ్చిన కొద్దిసేపటికే సిడ్నీలోని ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల్లో శ్రేయాస్ కు అంతర్గతంగా రక్తస్రావం అయినట్లు గుర్తించిన డాక్టర్లు అతడికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)చికిత్స అందిస్తున్నారు. శ్రేయాస్ రెండు రోజులుగా ఐసీయూలో ఉన్నాడు. రాబోయే 48 గంటల్లో రక్తస్రావం తగ్గకపోతే.. అతడికి వారం రోజుల వరకు రెస్ట్ అవసరమం ఉంటుందని డాక్టర్లు సూచించారు.
స్పృహ తప్పడంతో..
గాయంతో మైదానాన్ని వీడాక డ్రెస్సింగ్‌రూమ్‌లో శ్రేయస్ స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే అతణ్ని ఆసుపత్రిలో చేర్చగా.. ప్లీహానికి గాయమైనట్లు స్కాన్స్‌తో తేలింది. క్యాచ్ అందుకునే క్రమంలో అతడు బలంగా నేలపై పడటంతో తీవ్రమైన గాయమైంది. ‘‘శ్రేయస్‌కు పక్కటెముకల దిగువ భాగంలో గాయమైంది. తదుపరి పరీక్షల కోసం అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లాం. అతడి ప్లీహానికి చీలిక వచ్చినట్లు స్కాన్స్‌లో తేలింది’’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘బీసీసీఐ వైద్య సిబ్బంది.. సిడ్నీ, భారత్‌లో స్పెషలిస్ట్‌లను సంప్రదిస్తూ శ్రేయస్ చికిత్సను పర్యవేక్షిస్తోంది. భారత జట్టు వైద్యుడు శ్రేయస్‌తో పాటు సిడ్నీలోనే ఉంటాడు’’ అని చెప్పింది. 30 ఏళ్ల శ్రేయస్ ఏడు రోజుల వరకు ఆసుపత్రిలో పరిశీలనలో ఉండొచ్చు.
ఆలస్యం అయ్యుంటే..?
శ్రేయాస్ గాయం తీవ్రతను సరిగ్గా అంచనా వేసిన బీసీసీఐ వైద్య బృందం అతడిని పెనుప్రమాదం నుంచి తప్పించింది. లేకుంటే పరిస్థితి విషమంగా మారేది. మైదానం నుంచి పెవిలియన్‌కు రాగానే అయ్యర్ గాయాన్ని మెడికల్ సిబ్బంది, ఫిజియో పరిశీలించారు. అంతలోనే అతను స్పృహ కోల్పోవడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలించారు. లేనిపక్షంలో క్రికెటర్ ప్రాణాల మీదికి వచ్చివుండేదని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. రక్తస్రావం ఆగకపోతే ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంటుంది కాబట్టి ఐసీయూలోనే రెండు రోజుల పాటు ఉంచారు. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్న శ్రేయా్‌సకు అండగా సిడ్నీలోని అతడి స్నేహితులు ఆస్పత్రిలోనే ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు సైతం వీసా ప్రక్రియ పూర్తికాగానే ఆస్ర్టేలియాకు పయనం కానున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే అయ్యర్‌ను భారత్‌కు పంపాలనే ఆలోచనలో బోర్డు ఉంది. వన్డే జట్టులో మాత్రమే ఉన్న అయ్యర్ బరిలోకి ఎప్పుడు దిగుతాడనే సందేహాలు నెలకొన్నాయి. శ్రేయాస్‌కు మూడు వారాల విశ్రాంతి అవసరమని భావించారు.