ICC: శుభ్‌మన్ గిల్‌కు ఐసీసీ అవార్డు

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా గిల్... భీకర ఫామ్ లో ఉన్న టీమిండియా ఓపెనర్;

Update: 2025-03-13 01:30 GMT

ఫిబ్రవరి నెలకు గాను టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వరించింది. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్‌)ను వెనక్కినెట్టి గిల్ ఈ అవార్డును దక్కించుకున్నాడు. ఫిబ్రవరి నెలలో 100కుపైగా సగటుతో 406 పరుగులు చేశాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌ నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతున్నాడు. గిల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకోవడం ఇది మూడోసారి. గిల్ ఈ అవార్డును 2023 జనవరి, సెప్టెంబర్ అందుకున్నాడు. ఫిబ్ర‌వ‌రిలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా 3-0తో క్లీన్ స్వీప్ చేయడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో శుభ్‌మాన్ గిల్ ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో సహా 259 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా గిల్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై గిల్ 46 పరుగులు, బంగ్లాదేశ్‌పై సెంచరీ చేశాడు.

సూపర్ ఫామ్ లో ఉన్న గిల్

శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో గిల్ 86.33 సగటుతో 259 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. నాగ్‌పుర్‌ వన్డేలో 87, కటక్‌లో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగులు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ గిల్ మంచి ప్రదర్శన చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 129 బంతుల్లో 101 పరుగులు చేసి అజేయంగా నిలవడంతోపాటు జట్టుకు విజయాన్నందించాడు.

అవ్‌నీత్ తో శుభ్‌మన్ డేటింగ్?

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, టీవీ నటి అవ్‌నీత్ కౌర్‌ డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. CT 2025లో భారత్, ఆసీస్ సెమీస్ మ్యాచ్‌కు ఆమె హాజరవడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. గతంలో గిల్, అవ్‌నీత్ కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. అలానే గతేడాది శుభ్‌మన్ బర్త్‌ డే సందర్భంగా అవనీత్‌ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపింది.

వన్డే ర్యాంకింగ్స్.. టాప్‌ -3లోకి రోహిత్

ఐసీసీ పురుషుల వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాప్‌ -3 ర్యాంక్ దక్కించుకున్నాడు. స్టార్ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్, పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ ఐదో స్థానం దక్కించుకోగా.. బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడో స్థానంలో, రవీంద్ర జడేజా 10వ స్థానంలో కొనసాగుతున్నారు.

Tags:    

Similar News