SIRAJ: సిరాజ్ సింహం లాంటోడబ్బా...
మేమే జాగ్రత్తగా కాపాడుకోవాలి... అసిస్టెంట్ కోచ్ డస్కటే కామెంట్స్;
భారత పేసర్ మహ్మద్ సిరాజ్ గురించి టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పనిభారం గురించి అతడు అస్సలు ఆలోచించడని.. తామే ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. సిరాజ్ సింహం లాంటివాడని.. జట్టు ప్రయోజనాల కోసం ఎల్లవేళలా బంతితో సిద్ధంగా ఉంటాడంటూ ప్రశంసించాడు. ‘‘అలాంటి ఆటగాడు మా జట్టులో ఉండటం మాకు సానుకూలాంశం. ఇక్కడ ఫాస్ట్‌బౌలర్‌గా అతడి నుంచి మనం అందరికంటే కాస్త ఎక్కువగానే వికెట్లు తీస్తాడని ఆశిస్తాం. అయితే, తను పనిభారం గురించి మాత్రం అస్సలు పట్టించుకోడు. అందుకే మేమే అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. సింహం లాంటి పోరాటపటిమ అతడి సొంతం." అని డస్కటే ప్రశంసల జల్లు కురిపించాడు. లార్డ్స్‌లో స్టోక్స్ మాదిరి అదనపు ఓవర్లు వేసేందుకు సిరాజ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని.... కానీ అతడు ఫిట్‌గా ఉండేలా చూసుకోవడం తమ పని అని డస్కటే వెల్లడించాడు. "అందుకే ఒక్కోసారి మేనేజ్మెంట్ అతడిని వారించాల్సి వస్తుంది కూడా. ఏదేమైనా అతడి చేతిలో బంతి ఉందంటే కచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేస్తాడనే నమ్మకం ఉంటుంది’’ అంటూ ఆట పట్ల సిరాజ్ అంకితభావం గురించి డస్కటే వివరించాడు.
సిరాజ్ పనిభారం గురించి ఆలోచించరా..?
బుమ్రా వర్క్‌లోడ్ గురించి ఆలోచించినట్లు సిరాజ్ పని భారం గురించి బీసీసీఐ ఆలోచిస్తుందా అనేది అనుమామనే. తాజాగా టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ సిరాజ్ వర్క్లోడ్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా గురించే కాదని సిరాజ్ గురించి కూడా ఆలోచించాల్సి ఉందని అతడు పేర్కొన్నాడు. వర్క్‌లోడ్ విషయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డులు వ్యవహరించే శైలిలో బీసీసీఐ కూడా ఉంటే బాగుంటుందనేది వాదన.
రెండేళ్లుగా సిరాజ్ కు గ్యాప్ లేదు
ఇందులో మొదటిది ఒకే టీమ్‌తో మూడు ఫార్మాట్లు ఆడటం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు టెస్టులకు ఒక టీమ్.. వన్డే, టి20లకు మరో టీమ్ ఉంటుంది. ఇలా జరిగితే ప్లేయర్లపై భారం తక్కువగా ఉంటుంది. ఇక భారత్ విషయానికి వస్తే దాదాపుగా సగం మంది ప్లేయర్లు మూడు ఫార్మాట్లలో ఆడుతుంటారు. దాని వల్ల ప్లేయర్లు తరచుగా గాయాల బారిన పడుతుంటారు. ఇక సిరాజ్ విషయానికి వస్తే.. టి20ల్లో తప్ప ఎక్కువగా వన్డేలు, టెస్టుల్లో ఆడుతున్నాడు. గ్యాప్ లేకుండా గత రెండేళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పటికైతే సిరాజ్ కు పెద్దగా గాయాల సమస్యలు లేవు. అయితే ఇలానే కొనసాగితే ఏదో ఒకరోజు అతడు గాయపడటం ఖాయం.ఈ క్రమంలో సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వడం మంచిది. బుమ్రా విషయంలో చేసిన తప్పును సిరాజ్ విషయంలో చేయకపోతే మంచిది. బుమ్రాకు మాత్రమే కాకుండా సిరాజ్‌కు కూడా తరచూ విశ్రాంతి ఇస్తూ ఉండాలి. లేదంటే గాయం బారిన పడే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే టీమిండియాకు పెద్ద దెబ్బే అవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రధాన ప్లేయర్లకు బ్యాకప్ ప్లేయర్లను తయారు చేయాల్సి ఉంటుంది.