SMRITHI: స్మృతి మంధానకు సర్‌ప్రైజ్‌ ప్రపోజల్‌

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మంధాన

Update: 2025-11-21 13:30 GMT

భారత మహి­ళల క్రి­కె­ట్‌ జట్టు ఓపె­న­ర్‌ అయిన స్మృ­తి మం­ధాన తనకు కా­బో­యే భర్త నుం­చి సర్‌­ప్రై­జ్‌ ప్ర­పో­జ­ల్‌ అం­దు­కుం­ది. మం­ధా­న­కు కా­బో­యే భర్త పలా­శ్‌ ము­చ్చ­ల్‌.. ఇటీ­వల వర­ల్డ్‌ కప్‌ ఫై­న­ల్‌ జరి­గిన ముం­బ­యి­లో­ని డీవై పా­టి­ల్‌ స్టే­డి­యం­లో స్మృ­తి మం­ధా­న­కు మో­కా­ళ్ల­పై ని­లు­చు­ని తన ప్రే­మ­ను వ్య­క్తం చే­శా­డు. తర్వాత మం­ధాన కూడా అత­ణ్ని కౌ­గి­లిం­చు­కుం­ది. అనం­త­రం ఉం­గ­రా­లు మా­ర్చు­కు­న్నా­రు. ఈ వీ­డి­యో­ను పలా­శ్‌ సో­ష­ల్‌ మీ­డి­యా­లో పో­స్ట్‌ చే­శా­డు. స్మృ­తి క‌­ళ్ల­‌­కి గం­త­‌­లు క‌­ట్టి స్టే­డి­యం ద‌­గ్గ­‌­రి­కి తీ­సు­కు­వ­‌­చ్చిన ప‌­లా­శ్.. అనం­త­‌­రం మో­కా­ళ్ల­పై కూ­ర్చు­ని ఉం­గ­రా­న్ని అం­దిం­చ­గా ఆశ్చ­ర్యా­ని­కి లో­నైన మం­ధాన వెం­ట­నే ఆ ప్ర­పో­జ­ల్‌­ను అం­గీ­క­రిం­చిం­ది. అనం­త­రం ఇద్ద­రూ ఉం­గ­రా­లు మా­ర్చు­కు­ని తమ ప్రేమ బం­ధా­న్ని మ‌­రిం­త‌ దృఢం చే­సు­కు­న్నా­రు.

Tags:    

Similar News