CT2025: విజయంతో ఆరంభించిన దక్షిణాఫ్రికా
తొలి మ్యాచ్‌లో అఫ్గాన్‌ను చిత్తు చేసిన ప్రొటీస్... 107 పరుగుల తేడాతో ఘన విజయం;
ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. గ్రూప్ బీ మ్యాచ్ లో మ్యాచులో అఫ్ఘానిస్థాన్‌ను చిత్తు చేసింది. గ్రూప్ బి పోరులో 107 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీలు చెలరేగి ఆడారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి దక్షిణాఫ్రికా 315 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు.. 43.3 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆఫ్ఘన్ బ్యాటర్ రెహమత్ షాహ్ (90) కీలక ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకుండా పోయింది.
చెలరేగిన రికిల్టెన్
దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో అసలైన స్టార్ ఎవరంటే అది కచ్చితంగా ర్యాన్ రికిల్టనే. రికిల్టన్ అద్భుతమైన సెంచరీతో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 315 పరుగులు చేసింది. కరాచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో ర్యాన్ రికిల్‌టన్ అద్భుతమైన సెంచరీతో (103 పరుగులు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 315 పరుగులు చేసింది. ర్యాన్ రికిల్టెన్ 106 బంతుల్లో 103 పరుగులు చేశాడు. రికిల్టన్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. వన్డే కెరీర్‌లో రికిల్టెన్‌కు ఇదే భారీ స్కోరు కావడం విశేషం. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా (58), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (52), ఐడెన్ మార్క్రమ్ (50*) అర్ధ సెంచరీలు సాధించారు. రికిల్టెన్... కెప్టెన్ బావుమాతో కలిసి రెండవ వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దురదృష్టవశాత్తూ 36వ ఓవర్‌లో రనౌట్ అయ్యాడు.
నిప్పులు చెరిగిన రబాడ
316 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ జట్టు 43.2 ఓవర్లలో 208 పరుగులకే కుప్పకూలింది. రెండో ఓవర్ మూడో బంతికే రహ్మానుల్లా గుర్బాజ్ ఔటయ్యాడు. కేవలం 10 పరుగులు మాత్రమే చేసి గుర్బాజ్ పెవిలియన్ కు చేరాడు. ఇబ్రహీం జద్రాన్ 17 పరుగులు, సెదికుల్లా అటల్ 16 పరుగులే చేసి ఔట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ కష్టాలు పెరిగాయి. మరో ఎండ్ లో రెహ్మత్ షా అర్ధ సెంచరీ సాధించాడు. రెహ్మత్ షా చివరి క్రీజులో ఉన్నా తన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. కెప్టెన్ హస్మతుల్లా షాహిది 0, అజ్మతుల్లా ఒమర్జాయ్ 18, గుల్బాదిన్ నయీబ్ 13 పరుగులు మాత్రమే చేశారు. రషీద్ ఖాన్ 18 పరుగులు చేసి అవుటయ్యాడు. రెహ్మత్ షా 92 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ తో 90 పరుగులు చేశాడు.