27 ఏళ్ల తర్వాత అన్ని ఫార్మాట్ల కంటే విలువైన టెస్ట్ ఛాంపియన్ షిప్‌ని దక్షిణాఫ్రికా గెలిచింది. కేశవ్ మహారాజ్‌తో పాటు అభిమానులందరూ కన్నీటి పర్యంతం అయ్యారు. కానీ.. బవుమా మాత్రం తల కిందకు దించుకున్నాడు. అతనికి జరిగిన అవమానాలు, చేసిన పోరాటం అన్ని గుర్తుకు వచ్చాయేమో అన్నట్లు తల దించుకున్నాడు. కానీ ఇదంతా చేసింది కన్న తల్లిలాంటి దేశం కోసమని గుర్తొచ్చి తలపైకి లేపి చప్పట్లు కొట్టడం ప్రారంభించాడు. అప్పడు అతడు పైకెత్తింది అతడి ఒకడి తలనే కాదు ప్రతి ఒక్క సౌతాఫ్రికాన్ తలను. పైకి చూస్తే కనిపించింది ఒకటే సౌతాఫ్రికా నేషనల్ ఫ్లాగ్.
ప్రయాణం ఇలా ముగిసింది...
రెండేళ్ల పాటు అద్భుత విజయాలతో సాగిన దక్షిణాఫ్రికా ప్రయాణం.. ప్రతిష్ఠాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌పను కైవసం చేసుకోవడంతో ముగిసింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బవుమా సేన ఐసీసీ టెస్టు గదను సగర్వంగా అందుకుంది. 1998లో నాకౌట్ ట్రోఫీ తర్వాత రెండో ఐసీసీ టోర్నీ విజయం కావడం విశేషం. ఈ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా గెలిచి ఉంటే ఆ దేశం మాత్రమే సంబరాలు చేసుకునేది. కానీ ఇప్పుడు దక్షిణాఫ్రికా గెలిచేసరికి క్రికెట్ ప్రపంచమంతా వేడుకలు చేసుకుంటోంది. గొప్ప ప్రతిభ, పోరాట స్ఫూర్తి ఉన్న దక్షిణాఫ్రికా ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడానికి అర్హమైన జట్టనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉంది. ఎట్టకేలకు ఆ జట్టు ఆశ తీరింది. ఇది మూడో డబ్ల్యూటీసీ ఫైనల్ కాగా.. ఒక్కోసారి ఒక్కో జట్టు కప్పు గెలవడం విశేషం.1999లో ఐసీసీ నాకౌట్ టోర్నీ విజేతగా నిలిచి ఐసీసీ ట్రోఫీ సాధించినప్పటికీ.. ప్రపంచ టోర్నీల్లో ఒక్కసారీ గెలవలేదనే బాధ సఫారీలను వెంటాడుతూ ఉంది. ఈ గెలుపుతో ఆ బాధ తీరిపోయింది. అందులోనూ ఐసీసీ టోర్నీల్లో తిరుగులేని రికార్డుండి, డబ్ల్యూటీసీ ఫైనల్లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఓడించి దక్షిణాఫ్రికా కప్పు సాధించడంతో వారి విజయం మరింత ప్రత్యేకంగా మారింది. ప్రతీ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో నాకౌట్ చేరడం.. కీలక మ్యాచ్‌లో తడబడి టోర్నీ నుంచి నిష్క్రమించడం సౌతాఫ్రికాకు అలవాటుగా మారింది.
ఆసీస్ మాపై స్లెడ్జింగ్‌కు దిగింది: బవుమా
WTC ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తమపై స్లెడ్జింగ్‌కు దిగినట్లు సౌతాఫ్రికా కెప్టెన్ బవూమా చెప్పాడు. ‘బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ భయంకరమైన చోకర్స్ పదాన్ని మేం విన్నాం. ఎంతో నమ్మకంతో ఈ మ్యాచ్ ఆడేందుకు వచ్చాం. మాపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. అయితే.. మా ఆటతీరు, ఈ విజయం వాటన్నింటినీ తుడిచిపెట్టింది. ఇది మా దేశానికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘‘బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ భయంకరమైన చోకర్స్ పదాన్ని మేం విన్నాం. ఎంతో నమ్మకంతో ఈ మ్యాచ్ ఆడేందుకు వచ్చాం. మాపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. అయితే.. మా ఆటతీరు, ఈ విజయం వాటన్నింటినీ తుడిచిపెట్టింది. ఇది మా దేశానికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను’’ అని మ్యాచ్ అనంతరం ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ బవుమా అన్నాడు. ఇక ‘చోకర్స్’ గురించి ఆ జట్టు స్పిన్నర్ కేశవ్ మహారాజ్ మాట్లాడుతూ.. ఈ ట్యాగ్ చాలా కాలంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతోందని.. అయితే ఇప్పుడు అది చరిత్రలో కలిసిపోయిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ఏ చిన్న అవకాశం వచ్చినా.. ఆస్ట్రేలియా వదలదనేది తెలిసిందే. ఈ క్రమంలో ప్రత్యర్థులపై ఒక్కోసారి హద్దులు దాటి స్లెడ్జింగ్‌కు దిగి వివాదాల్లో నిలుస్తుంటుంది. కమిన్స్ సారథ్యంలోని ఆసీస్‌లో చాలా మార్పులు వచ్చినప్పటికీ.. ప్రతిష్ఠాత్మక పోరులో మళ్లీ ఇలా స్లెడ్జింగ్‌కు దిగడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.
చివరిగా ఐసీసీ సిరీస్ లలో చోకర్స్ అనే అబాండాన్ని మోస్తున్న దక్షిణాఫ్రికా జట్టు అందరి నోళ్లను మూయించింది. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. ఐసీసీ టోర్నీలలో తిరుగులేని కమ్మిన్స్ సేనకు పరాభవం ఎదురైంది. ఒక దిశలో దక్షిణఫ్రికా గెలవడమే కష్టం అనుకున్న దశలో క్రీజ్ లోకి వచ్చిన మార్కరమ్, బవుమా జాగ్రత్తగా సరికొత్త చరిత్రకు జాగ్రతగా పునాదులు వేసి సఫారీలకు చారిత్రక విజయాన్ని అందించారు.రెండేళ్ల పాటు అద్భుత విజయాలతో సాగిన దక్షిణాఫ్రికా ప్రయాణం.. ప్రతిష్ఠాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌పను కైవసం చేసుకోవడంతో ముగిసింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బవుమా సేన ఐసీసీ టెస్టు గదను సగర్వంగా అందుకుంది.