SPORTS: టాలీవుడ్ హీరోయిన్‌తో పృథ్వీ షా డేటింగ్
‘త్రిముఖ’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఆకృతి;
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచాడు. రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్, టాలీవుడ్ హీరోయిన్ అకృతి అగర్వాల్‌తో కలిసి వినాయక చవితి పూజల్లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ అకృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇద్దరూ గణేశుడి విగ్రహం పక్కన నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెయిర్ బాగుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అకృతి అగర్వాల్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో టిక్‌టాక్‌లో డ్యాన్స్ వీడియోలు చేసి పాపులర్ అయ్యారు. దేశంలో టిక్‌టాక్ నిషేధించబడిన తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌పై దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆమెకు 3.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్ ఛానెల్‌కు 88.8 వేలమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘త్రిముఖ’ అనే టాలీవుడ్ మూవీలో ఆకృతి హీరోయిన్‌గా నటించారు.బాలీవుడ్ ఆరంగేట్రంకు సిద్ధమవుతున్నారు. ఫామ్ కోల్పోయిన ప్రథ్వీ షా భారత జట్టులో చోటు కోల్పోయాడు. ముంబై క్రికెట్ అసోషియేషన్‌కు టాటా చెప్పిన అతడు.. ప్రస్తుతం మహారాష్ట్రకు ఆడుతున్నాడు. బుచ్చిబాబు టోర్నీ 2025లో ఆడుతున్న ప్రథ్వీ షా.. ఛత్తీస్‌ఘడ్ (111)పై సెంచరీ చేశాడు. తమిళనాడుపై కూడా హాఫ్ సెంచరీ బాది సత్తాచాటాడు.