ASHWIN: అదే జరిగితే.. ఆర్సీబీకి కష్టమే: అశ్విన్
ఫైనల్‌కు ముంబై వస్తే బెంగళురు కప్పు కష్టమే అన్న అశ్విన్;
మాజీ క్రికెట్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2025 ఫైనల్‌లో ఆర్సీబీ గెలవాలంటే ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్స్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోవాల్సిందే అని అన్నారు. ఒకవేళ ముంబై ఫైనల్‌కి చేరితే ఆర్సీబీ కప్ సాధించడం అసంభవం అని అన్నారు. ఇప్పటికే ఆర్సీబీ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. అశ్విన్ కామెంట్స్‌పై మీరు ఏకీభవిస్తారా కామెంట్ చేయండి. "రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను సాధించాలంటే, ముంబయి ఇండియన్స్‌ను ఫైనల్లోకి రానివ్వకపోతే మంచిదని తన యూట్యూబ్ ఛానల్‌లో అభిప్రాయపడ్డాడు. "ఒకవేళ ముంబయి ఫైనల్‌కు చేరితే, ఆర్సీబీ ఆశలు చెల్లాచెదురైపోతాయి. ముంబయి గెలిస్తే అది ఆరవ టైటిల్ అవుతుంది. బెంగళూరు టైటిల్ గెలవాలంటే గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కొంటే బాగుంటుంది. "ఇది ఆర్సీబీ సంవత్సరం కావచ్చు. విరాట్ కోహ్లీ తన ఆటతీరుతో బెంగళూరు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అని అన్నాడు.
ఆర్సీబీ గెలిస్తే సెలవు ఇవ్వండి'
ఐపీఎల్-2025 ఫైనల్‌లో ఆర్సీబీ గెలిస్తే ఆ తర్వాతి రోజు సెలువు ఇవ్వాలని ఆర్సీబీ ఫ్యాన్స్ సీఎం సిద్ధ రామయ్యకు లేఖ రాశారు. కర్ణాటకకు చెందిన ఓ అభిమాని జూన్ 3న ఆర్సీబీ ఫైనల్‌లో గెలిస్తే ఆ రోజును రాష్ట్ర పండుగగా గుర్తించి ఏటా సెలవు ఇవ్వాలని ఆ లేఖలో అభ్యర్థించాడు. ఈ విజయాన్ని రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎంను కోరాడు.
అంత అహంకారమా: మూడీ
ఐపీఎల్-2025లో భాగంగా గురువారం జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచులో బెంగళూరు చేతిలో పంజాబ్ కింగ్స్ ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్‌పై ఆస్ట్రేలియన్ క్రికెట్ లెజెండ్ టామ్ మూడీ ఘాటుగా స్పందించాడు. కీలక మ్యాచ్‌లో అత్యంత ప్రమాదకరమైన హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అటాకింగ్ షాట్స్ ఆడటం పూర్తిగా అహంకారం అని పేర్కొన్నాడు. మ్యాచులు గెలవాలంటే ఈగోను పక్కనపెట్టి ఆడాలని అన్నాడు. కొన్నిసార్లు శ్రేయస్ అయ్యర్ తన అహంకారాన్ని మడిచి జేబులో పెట్టుకోవాలి. పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోకుండా హజెల్ వుడ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో ఆడి శ్రేయస్ అయ్యర్ మూల్యం చెల్లించుకున్నాడు. తన అహంకారాన్ని పక్కనపెట్టి హజెల్ వుడ్ బౌలింగ్ ఆచితూచి ఆడి.. ఇతర బౌలర్లపై అటాక్ చేసుంటే ఫలితం మరోలా ఉండేది.'అని టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో హజెల్ వుడ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ 22 బంతులు ఎదుర్కొని 4 సార్లు ఔటయ్యాడు. 11 పరుగులు మాత్రమే చేశాడు.