SURYA: సూర్య కెప్టెన్సీలో "హిట్‌" మార్క్

సూర్య కెప్టెన్సీ అద్భుతం.. రోహిత్ శర్మ ఛాయలు.. సక్సెస్ రేటు 84%... వరల్డ్ కప్ వేట షురూ

Update: 2026-02-02 05:30 GMT

టీమ్ ఇం­డి­యా టీ20 సా­ర­థి సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ నా­య­క­త్వ ప్ర­తి­భ­పై మాజీ క్రి­కె­ట­ర్ ఇర్ఫా­న్ పఠా­న్ ఆస­క్తి­కర వ్యా­ఖ్య­లు చే­శా­రు. కె­ప్టె­న్‌­గా సూ­ర్య­కు రా­వా­ల్సి­నంత గు­ర్తిం­పు రా­వ­డం లే­ద­ని ఆయన అభి­ప్రా­య­ప­డ్డా­రు. పొ­ట్టి ఫా­ర్మా­ట్‌­లో సూ­ర్య­కు ఉన్న అద్భు­త­మైన రి­కా­ర్డు­ను ప్ర­స్తా­వి­స్తూ, అతడి వి­జ­యాల శాతం 84గా ఉం­డ­టం సా­మా­న్య­మైన వి­ష­యం కా­ద­ని పఠా­న్ గు­ర్తు చే­శా­రు. నా­య­కు­డి­గా జట్టు­ను వి­జ­య­ప­థం­లో నడి­పి­స్తు­న్న­ప్ప­టి­కీ, వి­శ్లే­ష­కు­లు అతడి వ్యూ­హా­ల­ను తగి­నం­త­గా ప్ర­శం­సిం­చ­డం లే­ద­ని పే­ర్కొ­న్నా­రు. సూ­ర్య­కు­మా­ర్ నా­య­క­త్వ శై­లి­ని గమ­ని­స్తే అం­దు­లో రో­హి­త్ శర్మ ఛా­య­లు కని­పి­స్తు­న్నా­య­ని ఇర్ఫా­న్ పఠా­న్ వి­శ్లే­షిం­చా­రు. సూ­ర్య­ను ప్ర­ధా­నం­గా 'బౌ­ల­ర్ల కె­ప్టె­న్'­గా ఆయన అభి­వ­ర్ణిం­చా­రు. మై­దా­నం­లో బౌ­ల­ర్ల అవ­స­రా­ల­ను గు­ర్తిం­చ­డం­లో, వా­రి­కి కా­వా­ల్సిన ఫీ­ల్డ్ సె­ట­ప్ ఇవ్వ­డం­లో సూ­ర్య ఎంతో శ్ర­ద్ధ చూ­పి­స్తా­డ­ని కొ­ని­యా­డా­రు. జట్టు ప్ర­యో­జ­నాల కోసం క్లి­ష్ట పరి­స్థి­తు­ల్లో కూడా సా­హ­సో­పే­త­మైన ని­ర్ణ­యా­లు తీ­సు­కో­వ­డం అతడి ప్ర­త్యే­కత అని, ఇది జట్టు­కు ఎంతో మేలు చే­స్తోం­ద­ని ఆయన వె­ల్ల­డిం­చా­రు.

కె­ప్టె­న్సీ పరం­గా వి­జ­య­వం­త­మై­న­ప్ప­టి­కీ, బ్యా­ట­ర్‌­గా సూ­ర్య తన పరు­గుల వే­ట­ను కొ­న­సా­గిం­చ­డం ఎంతో కీ­ల­క­మ­ని ఇర్ఫా­న్ సూ­చిం­చా­రు. 2025వ సం­వ­త్స­రం­లో సూ­ర్య కొం­త­కా­లం పాటు ఫామ్ లే­మి­తో ఇబ్బం­ది పడ­టం­పై ఆయన స్పం­దిం­చా­రు. . గత ఏడా­ది 21 ఇన్నిం­గ్స్‌­ల్లో కే­వ­లం 218 పరు­గు­లు మా­త్ర­మే చే­య­డం సూ­ర్య స్థా­యి­కి తగ­ద­ని, అం­దు­కే వర­ల్డ్ కప్ వంటి మెగా టో­ర్నీ­ల­కు ముం­దు బ్యా­ట్‌­తో రా­ణిం­చ­డం అత­డి­కి ఎంతో అవ­స­ర­మ­ని పే­ర్కొ­న్నా­రు. తన సహజ సి­ద్ధ­మైన ఆట­తీ­రు­తో పరు­గు­లు సా­ధి­స్తే­నే కె­ప్టె­న్‌­గా కూడా అత­డి­కి మరింత ఆత్మ­వి­శ్వా­సం పె­రు­గు­తుం­ద­ని తె­లి­పా­రు. అయి­తే టీ20 వర­ల్డ్ కప్ 2026కు ముం­దు సూ­ర్య తి­రి­గి ఫా­మ్‌­లో­కి రా­వ­డం పట్ల ఇర్ఫా­న్ సం­తో­షం వ్య­క్తం చే­శా­రు. న్యూ­జి­లాం­డ్‌­తో జరి­గిన టీ20 సి­రీ­స్‌­లో వరు­స­గా రెం­డు హాఫ్ సెం­చ­రీ­లు సా­ధిం­చ­డం ద్వా­రా సూ­ర్య తన వి­మ­ర్శ­కు­ల­కు గట్టి సమా­ధా­నం ఇచ్చా­రు. 2024 అక్టో­బ­ర్ తర్వాత మళ్లీ ఇప్పు­డే ఆయన వరు­స­గా అర్ధ­శ­త­కా­లు నమో­దు చే­య­డం టీమ్ ఇం­డి­యా­కు సా­ను­కూల అంశం. ఈ పు­న­రా­గ­మ­నం ప్ర­పం­చ­క­ప్ బరి­లో ది­గు­తు­న్న భారత జట్టు­లో కొ­త్త ఉత్సా­హా­న్ని నిం­పిం­ద­ని క్రీ­డా వి­శ్లే­ష­కు­లు భా­వి­స్తు­న్నా­రు. తన­దైన శై­లి­లో మై­దా­నం నలు­మూ­ల­లా షా­ట్లు ఆడు­తూ సూ­ర్య మళ్లీ ఫా­మ్‌­లో­కి రా­వ­డం ప్ర­త్య­ర్థి బౌ­ల­ర్ల­కు ప్ర­మాద సం­కే­తం­గా మా­రిం­ది.

ఫి­బ్ర­వ­రి 7 నుం­చి ప్రా­రం­భం కా­ను­న్న టీ20 ప్ర­పం­చ­క­ప్ భా­ర­త్, శ్రీ­లంక వే­ది­క­లు­గా జర­గ­నుం­ది. ఈ మెగా టో­ర్నీ­లో సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ అటు కె­ప్టె­న్‌­గా, ఇటు బ్యా­ట­ర్‌­గా తన వి­శ్వ­రూ­పం చూ­పిం­చా­ల­ని అభి­మా­ను­లు కో­రు­కుం­టు­న్నా­రు. స్వ­దే­శీ గడ్డ­పై జరు­గు­తు­న్న ఈ టో­ర్నీ­లో సూ­ర్య నా­య­క­త్వం­లో­ని భారత జట్టు కప్పు గె­ల­వా­ల­ని ఇర్ఫా­న్ పఠా­న్ ఆకాం­క్షిం­చా­రు. సూ­ర్య బ్యా­ట్ నుం­చి పరు­గుల సు­నా­మీ వస్తే, టీమ్ ఇం­డి­యా­కు తి­రు­గుం­డ­ద­ని ఆయన తన వి­శ్లే­ష­ణ­ను ము­గిం­చా­రు. సొంత గడ్డ­పై అభి­మా­నుల కే­రిం­తల మధ్య భా­ర­త్‌­ను వి­శ్వ­వి­జే­త­గా ని­ల­బె­ట్టే చా­రి­త్రా­త్మక బా­ధ్యత ఇప్పు­డు ఈ 'మి­స్ట­ర్ 360' ఆట­గా­డి భు­జా­ల­పై ఉంది.

Tags:    

Similar News