T20 WORLD CUP: ఐసీసీ హెచ్చరికలతో దిగొచ్చిన దాయాది

యథాతథంగా భారత్-పాక్ మ్యాచ్

Update: 2026-02-10 04:30 GMT

T20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ యథాతథంగా జరగనుంది. సోమవారం రాత్రి ఐసీసీ, పీసీబీ, బీసీబీ, శ్రీలంక క్రికెట్ బోర్డుల సమావేశం అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. స్నేహపూర్వక దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సోమవారం రాత్రి ఈ మేరకు పాక్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్నేహపూర్వక దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, బహుళపక్ష చర్చల్లో సాధించిన ఫలితాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. క్రికెట్ స్ఫూర్తిని కాపాడటంతో పాటు, ఈ గ్లోబల్ క్రీడ కొనసాగింపునకు మద్దతు ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ప్రతిష్ఠంభనను తొలగించేందుకు ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు కూడా ఈ మ్యాచ్ ఆడి తీరాలని పాక్‌ను కోరాయి. శ్రీలంక అధ్యక్షుడు కూడా పాక్ ప్రధానితో ఫోన్‌లో మాట్లాడటంతో ఈ సంక్షోభం ముగిసింది.

పాక్ గొంతెమ్మ కోరికలు

ఐదు గం­ట­ల­కు పైగా సా­గిన ఈ సమా­వే­శం­లో పా­కి­స్థా­న్ పలు కీలక డి­మాం­డ్ల­ను ఐసీ­సీ ముం­దు ఉం­చి­న­ట్లు పా­కి­స్థా­న్ మీ­డి­యా కథ­నా­లు వె­ల్ల­డిం­చా­యి. బం­గ్లా­దే­శ్ క్రి­కె­ట్ అభి­వృ­ద్ధి కోసం ఐసీ­సీ నుం­చి అద­న­పు ని­ధు­లు కే­టా­యిం­చా­లి, టీ20 ప్ర­పం­చ­క­ప్‌­లో పా­ల్గొ­న­క­పో­యి­నా బం­గ్లా­దే­శ్‌­కు పా­ర్టి­సి­పే­ష­న్ ఫీజు మం­జూ­రు చే­యా­లి, భవి­ష్య­త్తు­లో బం­గ్లా­దే­శ్‌­కు ఐసీ­సీ ఈవెం­ట్ల ఆతి­థ్య హక్కు­లు ఇవ్వా­లి, ఐసీ­సీ మొ­త్తం రె­వె­న్యూ­లో పా­కి­స్థా­న్ వా­టా­ను పెం­చా­లి వంటి డి­మాం­డ్లు ఇం­దు­లో ఉన్నా­యి. అం­తే­కా­దు, భా­ర­త్‌­తో ద్వై­పా­క్షిక సి­రీ­స్‌­ల­ను పు­న­రు­ద్ధ­రిం­చా­లి, మ్యా­చ్‌ల సమ­యం­లో భారత ఆట­గా­ళ్లు షేక్ హ్యాం­డ్ ఇవ్వా­ల్సిం­ది­గా ప్ర­త్యేక ప్రో­టో­కా­ల్స్ జారీ చే­యా­లి అనే అం­శా­ల­ను కూడా పీ­సీ­బీ ప్ర­స్తా­విం­చి­న­ట్లు సమా­చా­రం. అయి­తే ఈ డి­మాం­డ్ల­పై ఐసీ­సీ ఏ మే­ర­కు అం­గీ­క­రిం­చిం­ద­న్న వి­ష­యం­పై ఇంకా స్ప­ష్టత లేదు. మరో­వై­పు, తమ ఆట­గా­ళ్ల భద్రత కా­ర­ణం­గా భా­ర­త్‌­లో పర్య­టిం­చ­లే­మ­ని, తమ ప్ర­పం­చ­క­ప్ మ్యా­చ్‌­ల­ను శ్రీ­లం­క­కు తర­లిం­చా­ల­ని బం­గ్లా­దే­శ్ క్రి­కె­ట్ బో­ర్డు ఐసీ­సీ­ని కో­రిం­ది. అయి­తే బం­గ్లా ఆట­గా­ళ్ల భద్ర­త­కు ఎలాం­టి ము­ప్పు లే­ద­ని స్ప­ష్ట­మైన హామీ ఇచ్చిన ఐసీ­సీ, ఆ వి­జ్ఞ­ప్తి­ని తో­సి­పు­చ్చిం­ది. అయి­న­ప్ప­టి­కీ బం­గ్లా­దే­శ్ టో­ర్నీ నుం­చి తప్పు­కో­వ­డం­తో, ఐసీ­సీ స్కా­ట్లాం­డ్‌­కు అవ­కా­శం కల్పిం­చిం­ది.ఈ ని­ర్ణ­యం­పై పీ­సీ­బీ తీ­వ్ర అసం­తృ­ప్తి వ్య­క్తం చే­సిం­ది. ఐసీ­సీ­పై పాకిస్థాన్ మం­డి­ప­డినట్లు తెలిసింది.

Tags:    

Similar News