T20 WORLD CUP: బ్యాట్‌తో దంచేశారు..బాల్‌తో కూల్చేశారు

నమీబియాపై టీమిండియా ఘన విజయం... 93 పరుగుల తేడాతో నమీబియా చిత్తు... మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్

Update: 2026-02-13 02:15 GMT

టీ20 ప్ర­పం­చ­క­ప్-2026లో భారత జట్టు తన తి­రు­గు­లే­ని ఆధి­ప­త్యా­న్ని మరో­సా­రి చా­టు­కుం­ది. ఢి­ల్లీ­లో­ని అరు­ణ్ జై­ట్లీ స్టే­డి­యం వే­ది­క­గా జరి­గిన గ్రూ­ప్-A పో­రు­లో నమీ­బి­యా­పై భా­ర­త్ 93 పరు­గుల తే­డా­తో ఘన­వి­జ­యం సా­ధిం­చిం­ది. ఈ వి­జ­యం­తో టీ­మిం­డి­యా పా­యిం­ట్ల పట్టి­క­లో అగ్ర­స్థా­నా­న్ని దక్కిం­చు­కుం­ది. బ్యా­టిం­గ్‌­లో ఇషా­న్ కి­ష­న్, హా­ర్ది­క్ పాం­డ్య మె­రు­పు­లు మె­రి­పిం­చ­గా, బౌ­లిం­గ్‌­లో వరు­ణ్ చక్ర­వ­ర్తి, అక్ష­ర్ పటే­ల్ మా­యా­జా­లం ప్ర­ద­ర్శిం­చా­రు. ఆల్‌­రౌం­డ్ ప్ర­ద­ర్శ­న­తో హా­ర్ది­క్ పాం­డ్య ‘ప్లే­య­ర్ ఆఫ్ ది మ్యా­చ్’ అవా­ర్డు అం­దు­కు­న్నా­డు. టాస్ ఓడి ముం­దు­గా బ్యా­టిం­గ్‌­కు ది­గిన భా­ర­త్‌­కు ఓపె­న­ర్ ఇషా­న్ కి­ష­న్ అది­రే ఆరం­భా­న్ని అం­దిం­చా­డు. కే­వ­లం 20 బం­తు­ల్లో­నే హాఫ్ సెం­చ­రీ పూ­ర్తి చేసి స్టే­డి­యా­న్ని ఊపే­శా­డు. 24 బం­తు­ల్లో 61 పరు­గు­లు (6 ఫో­ర్లు, 5 సి­క్స­ర్లు) చే­సిన కి­ష­న్, బౌం­డ­రీల వర్షం కు­రి­పిం­చా­డు. మరో­వై­పు తుది జట్టు­లో­కి వచ్చిన సంజు శాం­స­న్ వే­గ­వం­త­మైన 22 పరు­గు­లు చే­శా­డు. తి­ల­క్ వర్మ, శి­వ­మ్ దూబే కూడా మంచి ఆరం­భా­లు ఇచ్చా­రు.

7 ఓవ­ర్ల­కే భా­ర­త్ స్కో­రు 104/1కి చే­రు­కో­వ­డం ఇన్నిం­గ్స్ దూ­కు­డు­కు ని­ద­ర్శ­నం. అయి­తే 300 పరు­గు­లు కూడా సా­ధ్య­మే అని­పిం­చిన దశలో అనూ­హ్యం­గా భా­ర­త్ తడ­బ­డిం­ది. 20 పరు­గుల వ్య­వ­ధి­లో ఇషా­న్, సూ­ర్య­కు­మా­ర్, తి­ల­క్ వి­కె­ట్లు కో­ల్పో­యిం­ది. నమీ­బి­యా కె­ప్టె­న్ గె­ర్హా­ర్డ్ ఎరా­స్మ­స్ అద్భు­తం­గా బౌ­లిం­గ్ చేసి 4 వి­కె­ట్లు తీసి భా­ర­త్ వే­గా­న్ని కట్ట­డి చే­శా­డు. మధ్య ఓవ­ర్ల­లో బా­ధ్యత తీ­సు­కు­న్న హా­ర్ది­క్ పాం­డ్యా అర్ధ­శ­త­కం­తో జట్టు­ను ని­ల­బె­ట్టా­డు. 28 బం­తు­ల్లో 52 పరు­గు­లు (4 ఫో­ర్లు, 4 సి­క్స­ర్లు) చేసి చి­వ­రి­వ­ర­కు పో­రా­డా­డు. చి­వ­ర్లో వరుస వి­కె­ట్లు కో­ల్పో­వ­డం­తో 20 ఓవ­ర్ల­లో భా­ర­త్ 9 వి­కె­ట్ల నష్టా­ని­కి 209 పరు­గు­లు చే­సిం­ది.

స్పిన్ మాయాజాలం

210 పరు­గుల లక్ష్యం­తో బరి­లో­కి ది­గిన నమీ­బి­యా ఆరం­భం­లో ధా­టి­గా ఆడిం­ది. 9 ఓవ­ర్ల­కు 85/2తో భా­ర­త్‌­కు సవా­లు వి­సి­రిం­ది. ఓపె­న­ర్లు స్టీ­న్‌­క్యాం­ప్ (29), ఫ్రై­లిం­క్ (22) ఆక­ట్టు­కు­న్నా­రు. కానీ అర్ష­దీ­ప్ సిం­గ్ ఫ్రై­లిం­క్‌­ను ఔట్ చే­య­డం­తో పతనం ప్రా­రం­భ­మైం­ది. అక్క­డి నుం­చి మ్యా­చ్ స్వ­రూ­ప­మే మా­రి­పో­యిం­ది. స్పి­న్న­ర్లు వరు­ణ్ చక్ర­వ­ర్తి, అక్ష­ర్ పటే­ల్ మా­యా­జా­లం ప్ర­ద­ర్శిం­చా­రు. వరు­ణ్ చక్ర­వ­ర్తి 3/7తో ప్ర­త్య­ర్థి జట్టు­ను గజగజ వణి­కిం­చా­డు. కీలక సమ­యం­లో వరుస వి­కె­ట్లు తీసి నమీ­బి­యా వె­న్ను వి­రి­చా­డు. అక్ష­ర్ పటే­ల్ 2/20తో రా­ణిం­చ­గా, హా­ర్ది­క్ పాం­డ్య కూడా 2 వి­కె­ట్లు సా­ధిం­చా­డు. బు­మ్రా, దూబే చెరో వి­కె­ట్ తీ­శా­రు. 30 పరు­గుల వ్య­వ­ధి­లో చి­వ­రి 8 వి­కె­ట్లు కో­ల్పో­యిన నమీ­బి­యా 18.2 ఓవ­ర్ల­లో 116 పరు­గు­ల­కు ఆలౌ­ట్ అయిం­ది. దీం­తో భా­ర­త్ 93 పరు­గుల తే­డా­తో ఘన వి­జ­యం నమో­దు చే­సిం­ది. టీ20 ప్ర­పం­చ­క­ప్ చరి­త్ర­లో పరు­గుల పరం­గా భా­ర­త్‌­కు ఇదే అతి­పె­ద్ద వి­జ­యం కా­వ­డం వి­శే­షం. ఈ విజయంతో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి గ్రూప్-Aలో అగ్రస్థానాన్ని బలపరిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సమన్వయం కనిపించడం జట్టుకు సానుకూల సంకేతం. అయితే ఆరంభ దూకుడును పూర్తి ఇన్నింగ్స్ పాటు కొనసాగించలేకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో ఆదివారం పాకిస్థాన్‌ను ఢీకొననుంది.

Tags:    

Similar News