T20 WORLCUP:ఇంగ్లాండ్ స్పిన్‌ ఉచ్చుకు బలైన శ్రీలంక

సూపర్ 8లో ఇంగ్లాండ్ ఘన విజయం... స్పిన్ ఉచ్చులో లంక ఉక్కిరిబిక్కిరి.. ఏడు వికెట్లు తీసిన బ్రిటీష్ స్పిన్నర్లు

Update: 2026-02-22 15:30 GMT

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 దశలో సహ ఆతిథ్య జట్టు శ్రీలంకకు తొలి ఓటమి ఎదురైంది. లీగ్ దశలో అజేయంగా ముందుకుసాగిన లంక జట్టుకు ఇంగ్లాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టోర్నీలో తన స్థాయిని చాటుకుంది. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో పన్నిన వ్యూహంతో శ్రీలంకను పూర్తిగా కట్టడి చేసింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 62 పరుగులతో అర్ధ సెంచరీ సాధించి జట్టును ఆదుకున్నాడు. అతడితో పాటు విల్ జాక్స్ 21 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో ఇంగ్లాండ్ గౌరవప్రదమైన స్కోరుకే పరిమితమైంది. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే 3 వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన చేశాడు. మహీశ్ తీక్షణ, దిల్షాన్ మధశంక చెరో రెండు వికెట్లు పడగొట్టగా, చమీర ఒక వికెట్ తీశాడు.

147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఇంగ్లాండ్ బౌలర్ల క్రమశిక్షణతో కూడిన దాడికి లంక బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. పవర్ ప్లే ముగిసే సమయానికే సగం జట్టును కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ దాసున్ శనక 30 పరుగులతో పోరాడినా, ఇతరుల నుంచి సరైన మద్దతు లభించలేదు. చివరకు శ్రీలంక 16.4 ఓవర్లలో కేవలం 95 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్ 3 వికెట్లు తీసి చెలరేగాడు. జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని ఖాయం చేశారు. ఏడు వికెట్లను స్పిన్నర్లే సాధించడం మ్యాచ్‌లో కీలకాంశంగా నిలిచింది. బ్యా­టిం­గ్, బౌ­లిం­గ్‌­లో అద్భుత ప్ర­ద­ర్శన చే­సిన విల్ జా­క్స్‌­కు ప్లే­య­ర్ ఆఫ్ ది మ్యా­చ్ అవా­ర్డు దక్కిం­ది. ఈ వి­జ­యం­తో ఇం­గ్లాం­డ్ సూ­ప­ర్-8లో తన స్థి­తి­ని బలో­పే­తం చే­సు­కో­గా, శ్రీ­లం­క­కు ఇది టో­ర్నీ­లో తొలి ఓట­మి­గా నమో­దు అయిం­ది. స్పి­న్ వ్యూ­హం­తో పన్నిన ఉచ్చు­లో లంక చి­క్కు­కో­వ­డం మ్యా­చ్‌­ను పూ­ర్తి­గా ఇం­గ్లాం­డ్ వైపు తి­ప్పిం­ది.

Tags:    

Similar News