TEAM INDIA: మరిన్ని షాక్‌లకు సిద్ధం కావాల్సిందేనా.?

గిల్‌కు కెప్టెన్సీతో మారిన సమీకరణాలు... రోహిత్‌-కోహ్లీ శకం ముగిసినట్లేనన్న వాదన.. ఆస్ట్రేలియా సిరీస్‌ కీలకం కానుందన్న చర్చ... చేదు వార్తలకు సిద్ధం కావాలన్న గవాస్కర్

Update: 2025-10-07 07:30 GMT

భా­ర­త్ వన్డే క్రి­కె­ట్ జట్టు­లో కీలక మా­ర్పు చో­టు­చే­సు­కుం­ది. భారత క్రి­కె­ట్ ని­యం­త్రణ మం­డ­లి (BCCI) ఆస్ట్రే­లి­యా పర్య­టన కోసం భారత జట్టు­ను ప్ర­క­టిం­చిం­ది. ఈ సారి పె­ద్ద ని­ర్ణ­యం తీ­సు­కుం­టూ రో­హి­త్ శర్మ­ను కె­ప్టె­న్ పదవి నుం­చి తప్పిం­చా­రు. యంగ్ ప్లే­య­ర్ శు­భ్‌­మ­న్ గి­ల్‌­ను వన్డే జట్టు­కు కొ­త్త కె­ప్టె­న్ గా ని­య­మిం­చా­రు. 2027 వన్డే ప్ర­పం­చ­క­ప్‌­ను దృ­ష్టి­లో ఉం­చు­కు­ని భవి­ష్య­త్ జట్టు­ను సి­ద్ధం చేసే క్ర­మం­లో ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్లు అజి­త్ అగా­ర్క­ర్ వె­ల్ల­డిం­చా­రు. అక్టో­బ­ర్ 19 నుం­చి ఆస్ట్రే­లి­యా వన్డే, టీ20 సి­రీ­స్‌ ప్రా­రం­భం కా­నుం­ది. రో­హి­త్ శర్మ, వి­రా­ట్ కో­హ్లీ 7 నెలల వి­రా­మం తర్వాత మళ్లీ జట్టు­లో చోటు దక్కిం­చు­కు­న్నా­రు. శ్రే­య­స్ అయ్య­ర్‌­ను వైస్ కె­ప్టె­న్ గా ని­య­మిం­చా­రు. గి­ల్‌­కు వన్డే నా­య­క­త్వ బా­ధ్య­త­లు అప్ప­గిం­చ­డం ద్వా­రా భవి­ష్య­త్తు ప్ర­ణా­ళి­క­ల­ను బీ­సీ­సీఐ వె­ల్ల­డిం­చిం­ది.

రోహిత్,విరాట్ భవిష్యత్తుపై అనిశ్చితి?

వన్డే వర­ల్డ్ కప్ ఆడా­ల­నే ఉద్దే­శా­న్ని ఇప్ప­టి­కే పలు­మా­ర్లు వి­రా­ట్, రో­హి­త్ లు వె­ల్ల­డిం­చా­రు. అయి­తే, ఈ మెగా టో­ర్నీ­లో ఇద్ద­రు స్టా­ర్ల ఆటను చూ­డ­టం కష్ట­మే అనే టాక్ వి­ని­పి­స్తోం­ది. ఎం­దు­కం­టే జట్టు­లో ప్ర­స్తు­తం యంగ్ ప్లే­య­ర్ల­కు ప్ర­ధా­న్యత ఇవ్వ­డం చూ­డ­వ­చ్చు.  అజి­త్ అగా­ర్క­ర్ ప్ర­కా­రం.. రో­హి­త్ శర్మ, వి­రా­ట్ కో­హ్లీ 2027 ప్ర­పం­చ­క­ప్ వరకు ఆడు­తా­రా లేదా అన్న­ది ఇంకా ని­ర్ణ­యిం­చ­లే­దు. ఆస్ట్రే­లి­యా పర్య­టన ఈ ఇద్ద­రి­కీ చి­వ­రి సి­రీ­స్ కా­వ­చ్చ­ని అం­చ­నా­లు కూడా ఉన్నా­యి. వారు ఆడి­నం­త­కా­లం జట్టు­కు వి­లు­వైన సే­వ­లు అం­దిం­చి­న­ప్ప­టి­కీ, కొ­త్త తరం నా­య­క­త్వా­న్ని ఏర్ప­ర­చ­డం­లో బీ­సీ­సీఐ దృ­ష్టి పె­ట్టి­న­ట్లు తె­లు­స్తోం­ది.

చేదు వార్తలు తథ్యం: గవాస్కర్

రో­హి­త్‌ స్థా­నం­లో గి­ల్‌­కు అవ­కా­శం ఇవ్వ­డం మంచి ని­ర్ణ­య­మ­ని అభి­ప్రా­య­ప­డిన ఆయన.. ఈ ని­ర్ణ­యం రా­బో­యే కా­లం­లో కొ­న్ని చేదు వా­ర్త­ల­కు ఆరం­భ­మ­న్నా­డు. దీం­తో ‘త్వ­ర­లో రో­హి­త్ రి­టై­ర్‌­మెం­ట్ తీ­సు­కుం­టా­డా?’ అనే చర్చ­ల­కు ఊత­మి­చ్చి­న­ట్లు అయిం­ది. ‘‘వన్డే వర­ల్డ్ కప్ - 2027 కోసం రో­హి­త్ శర్మ సి­ద్ధం­గా ఉం­టా­డ­ని అను­కో­వ­డం లేదు. ఇం­ట­ర్నే­ష­న­ల్ క్యా­లెం­డ­ర్‌­లో మన జట్టు­కు రా­బో­యే రెం­డే­ళ్ల­లో ఎక్కువ వన్డే­లు లేవు. సం­వ­త్స­రా­ని­కి ఆరే­డు మా­త్ర­మే ఆడి­తే వా­రి­కి సరైన మ్యా­చ్‌ ప్రా­క్టీ­స్ దొ­ర­క­దు. వర­ల్డ్ కప్‌ కోసం ఆ సన్న­ద్ధత సరి­పో­దు. అం­దు­కే శు­భ్‌­మ­న్‌ గి­ల్‌­ను సి­ద్ధం చే­సేం­దు­కు బీ­సీ­సీఐ ‘కె­ప్టె­న్సీ’ ని­ర్ణ­యం తీ­సు­కొ­ని ఉం­డొ­చ్చు’’ అని గా­వ­స్క­ర్‌ వ్యా­ఖ్యా­నిం­చా­డు.

అదొక్కటే మార్గం: ఇర్ఫాన్ పఠాన్

‘రో­హి­త్ తన ఫి­ట్‌­నె­స్‌­పై బాగా పని­చే­శా­డు. అతడు దా­ని­పై­నే దృ­ష్టి పె­ట్టా­డు. రె­గ్యు­ల­ర్ క్రి­కె­ట్ ఆడ­క­పో­తే కొంత ఆట సమ­యా­న్ని కే­టా­యిం­చు­క­ని దే­శ­వా­ళీ క్రి­కె­ట్ ఆడా­లి. రో­హి­త్, కో­హ్లీ పె­ద్ద ఆట­గా­ళ్లు. ఎంతో అను­భ­వం ఉంది. ఏం చే­యా­లో వా­రి­కి తె­లు­సు. కానీ, సమ­స్య ఏం­టం­టే వా­రి­ద్ద­రూ టీ20లు కూడా ఆడటం లేదు. ప్ర­పంచ కప్‌­కు ముం­దు భా­ర­త్ కొ­న్ని వన్డే­లే ఆడ­నుం­ది. ఆ మ్యా­చ్‌­ల­కు టో­ర్నీ ఆరం­భా­ని­కి మధ్య చాలా వి­రా­మం ఉంది. వర­ల్డ్ కప్‌ కోసం ఫి­ట్‌­గా ఉం­డ­టా­ని­కి వారు క్ర­మం తప్ప­కుం­డా మ్యా­చ్‌­లు ఆడటం అవ­స­రం. అప్పు­డే 2027 ప్ర­పంచ కప్ ఆడా­ల­నే రో­హి­త్, కో­హ్లీ కల నె­ర­వే­రు­తుం­ది’ అని ఇర్ఫా­న్ పఠా­న్ పే­ర్కొ­న్నా­డు.

Tags:    

Similar News