IPL: ముంబై టీమ్‌లో మరో తెలుగు కుర్రాడు

చెన్నైతో మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన కాకినాడ కుర్రాడు... పేసర్‌గా రాణిస్తున్న సత్యనారయణరాజు;

Update: 2025-03-24 03:00 GMT

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో మరో తెలుగు కుర్రాడు ఆరంగేట్రం చేశాడు. ముంబై ఇండియన్స్ టీమ్‌ తరఫున కాకినాడ జిల్లాకు చెందిన పేసర్ సత్యనారాయణరాజు ఆదివారం డెబ్యూ మ్యాచ్ ఆడాడు. ఇతడిని ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇతని తండ్రి ఓ రొయ్యల వ్యాపారి. ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో రాయలసీమ కింగ్స్‌కు ఆడిన రాజు 6.15 ఎకానమీతో 8 వికెట్లు తీశాడు. రంజీ ట్రోఫీలో 16, లిస్ట్ A క్రికెట్‌లో 9, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 వికెట్లు తీశాడు.

తండ్రి రొయ్యల వ్యాపారి

తూర్పుగోదావరి జిల్లా కుర్రాడు, ఫాస్ట్ బౌలర్ పీవీ సత్యనారాయణరాజు మెగా వేలంలో ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గోగన్న మఠానికి చెందిన సత్యనారాయణరాజు పదిహేనేళ్లుగా కాకినాడ వెంకట నగర్లో ఉంటున్నాడు. తండ్రి రమేష్ రాజు రొయ్యల వ్యాపారి, అమ్మ గృహిణి.. వీరి చిన్నకుమారుడు పాండురంగరాజు కూడా క్రికెటరే. రమేశ్‌ రాజుకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. కుటుంబ పరిస్థితుల రీత్యా ఆడలేకపోయానని.. తన పిల్లలనైనా క్రికెటర్లను చేయాలని తపన పడ్డాడు. కాకినాడకు మకాం మార్చాడు. రంగరాయ వైద్య కళాశాల మైదానంలో సాదన చేసే సత్యనారాయణ... తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరపున అన్ని మ్యాచ్లు ఆడాడు.

రికార్డు మిస్ చేసుకున్న హైదరాబాద్‌

ఐపీఎల్ సీజన్లు మారినా.. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. అయితే, ఇవాళ రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ చరిత్ర సృష్టించే అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించే అవకాశాన్ని రెండు పరుగుల తేడాతో కోల్పోయింది. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. దీంతో గతంలో తన పేరిటే ఉన్న అత్యధిక స్కోరు 287/3 రికార్డును అధిగమించలేకపోయింది.

చెన్నైకు ఆడుతూనే ఉంటా: MS ధోనీ

ఐపీఎల్-2025 తర్వాత రిటైర్మెంట్ అవుతాడనే వార్తలను భారత మాజీ కెప్టెన్ MS ధోనీ కొట్టిపడేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘చెన్నై సూపర్ కింగ్స్‌ నా ఫ్రాంచైజీ. చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున మరింత కాలం ఆడాలని అనుకుంటున్నా. ఒకవేళ నేను వీల్‌ఛైర్‌లో ఉన్నా సరే నన్ను లాక్కెళ్లిపోతారు’ అని వ్యాఖ్యానించారు. దీంతో ధోనీ రిటైర్మెంట్ వార్తలకు పుల్‌స్టాఫ్ పడినట్లు అయ్యింది.

Tags:    

Similar News