ఈడెన్ గార్డెన్స్‌లో ధోనీపై ప్రేక్షకులు కురిపించిన ప్రేమ వర్షం
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ MS ధోని ఏప్రిల్ 23న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ కోసం నడుచుకుంటూ వెళ్లడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది.;
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ MS ధోని ఏప్రిల్ 23న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ కోసం నడుచుకుంటూ వెళ్లడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ఈడెన్‌లో ధోనీకి మద్దతుదారులు స్వాగతం పలికారు. ప్రపంచ కప్ గెలిచిన 4 సంవత్సరాల తరువాత భారత కెప్టెన్‌గా CSKతో కలిసి ఈడెన్ గార్డెన్స్‌కు తిరిగి వచ్చిన ధోనీకి ఘనస్వాగతం లభించింది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడని ఊహాగానాలు వస్తుండడంతో అతడికి మరింత ఆదరణ లభిస్తోంది. కోల్‌కతాలోని విమానాశ్రయంలో ధోనీని చూసేందుకు వేలాది మంది క్యూలో నిలబడ్డారు.
టాస్ అనంతరం మాట్లాడిన ధోనీ ఖరగ్‌పూర్‌లో టిక్కెట్ కలెక్టర్‌గా పనిచేసిన రోజులను, బెంగాల్‌లో తన దేశవాళీ క్రికెట్ రోజులను గుర్తు చేసుకున్నాడు. "నేను ఇక్కడ చాలాసార్లు క్రికెట్ ఆడాను. కానీ నేను U16 లేదా U19 ఆడలేదు. కానీ, ఖరగ్‌పూర్‌లో ఉద్యోగం చేయడం వలన ఈ ప్రేమ, అభిమానం అక్కడి నుంచే వచ్చిందని భావిస్తున్నాను. ఖరగ్‌పూర్ ఇక్కడ నుండి 2 గంటల దూరంలో ఉంది. అక్కడే నేను చాలా సమయం గడిపాను, క్రికెట్, ఫుట్‌బాల్ కూడా ఆడాను అని MS ధోని చెప్పాడు.
ఐపిఎల్ 2023 సీజన్‌లో చెన్నైలో తనకు అందుతున్న మద్దతుకు CSK కెప్టెన్ కృతజ్ఞతలు తెలిపాడు. " ఇది నా కెరీర్‌లో చివరి దశ, ఆటను ఆస్వాదించడం చాలా ముఖ్యం" అని ధోని చెప్పాడు. గాయంతో బాధపడేవారికి విశ్రాంతినిచ్చి.. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలి. వారు అద్భుతంగా ఆడేలా ప్రోత్సహించాలి. ఇప్పుడు వస్తున్న యువ క్రీడాకారులు అద్భుతగా రాణిస్తున్నారు. సీనియర్ ఆటగాడు అజింక్య రహానె అదరగొట్టాడు. అతడి సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. అతడికి స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇచ్చాం. అందుకే అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన వచ్చింది’’ అని ధోనీ తెలిపాడు.
అజింక్య మాట్లాడుతూ ఇప్పుడు సీఎస్‌కే తరఫున ఆడుతూ ఇంకా నేర్చుకునే అవకాశాన్ని పొందుతున్నాను. కెప్టెన్ ధోనీ చెప్పింది వింటే చాలు’’ అని అన్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అజింక్య రహానెకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.