THE ASHES: రెండు జట్లలో తేడా "హెడ్" ఒక్కడే
తొలి టెస్టులో ట్రావిస్ హెడ్ అద్భుత శతకంపై ప్రశంసలు
ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగియగా.. ఇంగ్లాండ్ జట్టుపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా వచ్చిన ట్రవిస్ హెడ్ ఆది నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఇంగ్లిష్ జట్టు శైలిలో ‘బజ్ బాల్’ ఆటతొ చెలరేగిన హెడ్.. 36 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా యాషెస్ సిరీస్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. అంతకు ముందు జాన్ బ్రౌన్ (33 బంతుల్లో), గ్రాహమ్ యాలోప్ (35), డేవిడ్ వార్నర్ (35), కెవిన్ పీటర్సన్ (36) ఈ ఘనత సాధించారు. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించిన హెడ్.. 69 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా మరో సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. యాషెస్ సిరీస్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచిన హెడ్.. ఛేదనలో భాగంగా నాలుగో ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 40 పరుగుల ఆధిక్యం పొందిన ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే జాక్ క్రాలీని మిచెల్ స్టార్క్ కాట్ అండ్ బౌల్డ్‌గా పెవిలియన్‌కు పంపాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ క్రాలీ ఐదో బంతికే అవుటవ్వడం విశేషం. ఆ తర్వాత బెన్ డకెట్, ఓలీ పోప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహించారు. దాంతో లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో లభించిన 40 పరుగుల ఆధిక్యం సాధించింది. మెరుపు వేగంతో బంతులు వేయడం తో వాటిని ఎదుర్కోవడంలో బ్యాటర్లు విఫలం అయ్యారు. దీంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 164 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగియగా.. ఇంగ్లాండ్ జట్టుపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని కంగారూలు 28.2 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (123; 83 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లు) టీ20 మ్యాచ్‌లా చెలరేగి ఆడి ఆసీస్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. మార్నస్ లబుషేన్ (51*; 49 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో మెరిశాడు. జేక్ వెదరాల్డ్ (23) పరుగులు చేశాడు.ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన హెడ్.. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. అతను 36 బంతుల్లో అర్ధ శతకం, 69 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. బెన్ స్టోక్స్ వేసిన 17 ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో కలిపి మొత్తం నాలుగు బౌండరీలు రాబట్టాడు. అనంతరం ఆర్చర్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. అట్కిన్సన్ వేసిన 20 ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 90ల్లోకి వచ్చేసి కాసేపటికే శతకం పూర్తి చేసుకున్నాడు. హెడ్, లబుషేన్ రెండో వికెట్‌కు 92 బంతుల్లో 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లకు షాక్ ఇచ్చారు.