TILAK: శుభ్‌మన్‌ గిల్ కోసం తెలుగోడికి అన్యాయం

గిల్‌ స్థానం కోసం తిలక్‌ వర్మపై వేటు..!... గంభీర్‌పై మండిపడుతున్న నెటిజన్లు... తిలక్‌వర్మపై వేటు పడితే గౌతీనే కారణం.!;

Update: 2025-08-19 07:00 GMT

ఇం­గ్లం­డ్ పర్య­ట­న­లో కె­ప్టె­న్‌­గా.. బ్యా­ట­ర్‌­గా సత్తా చా­టిన టీ­మిం­డి­యా టె­స్ట్ సా­ర­థి శు­భ్‌­మ­న్ గి­ల్‌­కు బీ­సీ­సీఐ ప్ర­మో­ష­న్ ఇవ్వా­ల­ను­కుం­టుం­ది. టీ20 ఫా­ర్మా­ట్‌­కు దూ­రం­గా ఉన్న శు­భ్‌­మ­న్ గి­ల్‌­ను ఆసి­యా కప్‌ 2025కు ఎం­పిక చే­యా­ల­నే ఆలో­చ­న­లో ఉంది. కొం­ద­రు మాజీ క్రి­కె­ట­ర్లు సైతం శు­భ్‌­మ­న్ గి­ల్‌­ను మూడు ఫా­ర్మా­ట్ల­కు సా­ర­థి­గా ఎం­పిక చే­యా­ల­ని డి­మాం­డ్ చే­స్తు­న్నా­రు. అయి­తే భారత టీ20 జట్టు­లో శు­భ్‌­మ­న్ గి­ల్‌­కు చోటు లేదు. సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ సా­ర­థ్యం­లో­ని కు­ర్రా­ళ్ల­తో కూ­డిన జట్టు అసా­ధా­రణ ప్ర­ద­ర్శన కన­బ­ర్చిం­ది. వరు­స­గా సి­రీ­స్‌­ల­ను కై­వ­సం చే­సు­కుం­ది.

క్రమ క్ర­మం­గా కె­ప్టె­న్సీ కూడా గిల్ కు ఇచ్చే అవ­కా­శా­లు ఎక్కు­వ­గా ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. ఇదే జరి­గి­తే.. వన్డే­ల­కు కూడా గిల్ కె­ప్టె­న్ అవు­తా­డు అన్న­మాట. అంటే ఓవ­రా­ల్ గా మూడు ఫా­ర్మా­ట్ల­కు కూడా గిల్ ను కె­ప్టె­న్ చేసే ఛా­న్సు­లు ఎక్కు­వ­గా కని­పి­స్తు­న్నా­యి. అయి­తే ఆసి­యా కప్ 2025 టో­ర్న­మెం­ట్ లో టీ­మిం­డి­యా జట్టు­లో­కి గిల్ వస్తే... తి­ల­క్ వర్మ తప్పు­కో­వా­ల్సి వస్తుం­ద­ని అం­టు­న్నా­రు. తె­లు­గు కు­ర్రా­డైన తి­ల­క్ వర్మ... మూడవ స్థా­నం­లో అద్భు­తం­గా రా­ణి­స్తా­డు. కానీ గిల్ రం­గం­లో­కి ది­గి­తే తి­ల­క్ వర్మ­ను సె­లె­క్ట్ చే­య­క­పో­వ­చ్చ­ని ప్రా­థ­మిక సమా­చా­రం అం­దు­తోం­ది. దీం­తో తె­లు­గు అభి­మా­ను­లు....బీ­సీ­సీ­ఐ­పై ఆగ్ర­హం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. అయి­తే వైస్ కె­ప్టె­న్ గా శుబ్ మన్ గిల్ కి ఇచ్చే ఆలో­చన చే­స్తు­న్న­ట్టు సమా­చా­రం. ఇక క్ర­మ­క్ర­మం­గా కె­ప్టె­న్సీ ని కూడా శుబ్ మన్ గిల్ కే ఇచ్చే అవ­కా­శా­లు ఎక్కు­వ­గా కని­పి­స్తు­న్నా­యి. ఒక­వేళ ఇదే కనుక జరి­గి­తే వన్డే­ల­కు కూడా గిల్ కె­ప్టె­న్ కచ్చి­తం­గా అవు­తా­డ­ని స్ప­ష్టం­గా అర్థ­మ­వు­తోం­ది. శు­భ్‌­మ­న్ గిల్ కోసం తి­ల­క్ వర్మ­ను తప్పిం­చ­డం భా­వ్యం కా­ద­ని మె­జా­ర్టీ సభ్యు­లు అభి­ప్రా­య­ప­డి­న­ట్లు సమా­చా­రం.

తిలక్‌ను బలిపశువును చేస్తారా..?

శు­భ్‌­మ­న్ గిల్ కోసం తి­ల­క్ వర్మ­ను తప్పిం­చ­డం భా­వ్యం కా­ద­ని మె­జా­ర్టీ సభ్యు­లు అభి­ప్రా­య­ప­డి­న­ట్లు సమా­చా­రం. వా­స్త­వా­ని­కి గతే­డా­ది­గా టీ20 ఫా­ర్మా­ట్‌­కు శు­భ్‌­మ­న్ గిల్ దూ­రం­గా ఉన్నా­డు. అతను చి­వ­రి టీ20 మ్యా­చ్‌­ను శ్రీ­లం­క­తో గతే­డా­ది జూ­లై­లో ఆడా­డు. మరో­వై­పు తి­ల­క్ వర్మ నెం­బ­ర్-3 బ్యా­ట­ర్‌­గా సెం­చ­రల మోత మో­గిం­చా­డు. మి­డి­లా­ర్డ­ర్‌­లో కీ­ల­కం­గా మా­రా­డు. అం­తే­కా­కుం­డా శు­భ్‌­మ­న్ గిల్ ఉన్న­ప్పు­డు కూడా తి­ల­క్ వర్మ­కు తుది జట్టు­లో చోటు దక్కిం­ది. ఇప్ప­టి వరకు 25 అం­త­ర్జా­తీయ టీ20లు ఆడిన తి­ల­క్ వర్మ 49.93 సగ­టు­తో 749 పరు­గు­లు చే­శా­డు. ఇం­దు­లో 2 శత­కా­ల­తో పాటు 3 హాఫ్ సెం­చ­రీ­లు ఉన్నా­యి. ఐసీ­సీ టీ20 ర్యాం­కిం­గ్స్‌­లో అతను నెం­బ­ర్ 2 ర్యాం­క్‌­లో కొ­న­సా­గు­తు­న్నా­డు.

దుమ్మురేపిన తెలుగోడు

టీ­మిం­డి­యా ఆడిన చి­వ­రి రెం­డు టీ20 సి­రీ­స్‌­లో­నూ తి­ల­క్ వర్మ దు­మ్ము­రే­పా­డు. ము­ఖ్యం­గా సఫా­రీ గడ్డ­పై వరు­స­గా(107*, 120*) రెం­డు సెం­చ­రీ­లు నమో­దు చే­శా­డు. ఇం­గ్లం­డ్ పర్య­ట­న­లో కా­స్త తడ­బ­డ్డా­డు. ఐపీ­ఎ­ల్ 2025 సీ­జ­న్‌­లో­నూ స్థా­యి­కి తగ్గ ప్ర­ద­ర్శన చే­య­లే­క­పో­యా­డు. 16 మ్యా­చ్‌­ల్లో 31.18 సగ­టు­తో 343 పరు­గు­లే చే­శా­డు. ఇం­దు­లో రెం­డు హాఫ్ సెం­చ­రీ­లు మా­త్ర­మే ఉన్నా­యి. ఈ ప్ర­ద­ర్శన నే­ప­థ్యం­లో­నే తి­ల­క్ వర్మ­ను తప్పిం­చి శు­భ్‌­మ­న్ గి­ల్‌­‌­ను తీ­సు­కో­వా­ల­నే వాదన వి­ని­పి­స్తు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. తె­లు­గు కు­ర్రా­డు తి­ల­క్ వర్మ మూడో స్థా­నం­లో అద్భు­తం­గా రా­ణి­స్తా­డు. గిల్ రం­గం­లో­కి ది­గి­తే తి­ల­క్ వర్మ­ను సె­ల­క్ట్ చే­య­క­పో­వ­చ్చ­ని భా­వి­స్తు­న్నా­రు. ఇదే జరి­గి­తే గిల్ కా­ర­ణం­గా అద్భుత క్రి­కె­ట­ర్ తి­ల­క్ వర్మ­కి అన్యా­యం జరు­గు­తుం­ద­నే చె­ప్ప­వ­చ్చు.

Tags:    

Similar News