ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ భారత అండర్-19 జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఎంపిక చేశారు. ఈ పర్యటన యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను చాటేందుకు గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే కెప్టెన్సీలో బీసీసీఐ 17 మంది ఆటగాళ్లను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసింది. అయిదు మంది స్టాండ్బై ప్లేయర్ల జాబితాను కూడా సెలక్షన్ ప్యానెల్ ప్రకటించింది. సెప్టెంబర్లో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 జట్టు, ఆస్ట్రేలియా అండర్-19 టీంతో 3 వన్డేలు, 2 మల్టీ డే మ్యాచ్లు ఆడేలా షెడ్యూల్ చేశారు. మల్టీ డే మ్యాచ్ 4 రోజులపాటు జరుగుతుంది. సెప్టెంబర్ 21న మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ పర్యటనలో చివరి మల్టీ డే మ్యాచ్ అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 10 వరకు జరుగుతుంది. IPLలో అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శన చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఇంగ్లాండ్ పర్యటనకు సెలక్ట్ చేయగా.. చారిత్రాత్మక ప్రదర్శన చేసి అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.
భారత అండర్-19 జట్టు:
ఆయుష్ మ్హత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, నమన్ పుష్పక్, హెనిల్ పటేల్, డి. దీపేష్, కిషన్ కుమార్, అన్మోల్జిత్ సింగ్, ఖిలాన్ పటేల్, ఉద్ధవ్ మోహన్, అమన్ చౌహాన్.