M.S. Dhoni: ధోనీ ఆట చూసి కంటతడి పెట్టిన ఫ్యాన్.. అందుకే గిఫ్ట్‌గా..
M.S. Dhoni: క్రికెట్ అనేది చాలామందికి ఎమోషన్. ఇతర ఆటలతో పోలిస్తే క్రికెట్‌కు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు ఆడియన్స్.;
M.S. Dhoni: క్రికెట్ అనేది చాలామందికి ఎమోషన్. ఇతర ఆటలతో పోలిస్తే క్రికెట్‌కు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. అందుకే తమ ఫేవరెట్ ప్లేయర్ ఓడిపోతే కంటతడి పెట్టుకోవడం, ఒకవేళ గెలిస్తే సంబరాలు చేసుకోవడం ఎక్కువగా క్రికెట్‌లోనే చూస్తుంటాం. అలాంటి ఒక ఐకానిక్ మూమెంట్ నిన్నటి(ఆదివారం) చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది.
ఎమ్ ఎస్ ధోనీ.. ఈ పేరును ఒక ఎమోషన్‌లాగా ఫీల్ అవుతారు క్రికెట్ లవర్స్. ముఖ్యంగా ఆయన హెలికాప్టర్ షాట్‌కు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. మ్యాచ్ ఓడిపోతుంది అన్న సమయంలో ధోనీ రావడం, తన హెలికాప్టర్ షాట్‌తో మ్యాచ్‌ను గెలిపించడం మనం చాలా సందర్భాల్లోనే చూశాం. చాలాకాలం తర్వాత నిన్నటి మ్యాచ్‌లోనే ధోనీ ఆటను పూర్తిస్థాయిలో వీక్షించారు తన ఫ్యాన్స్.
చివరి ఓవర్‌లో బరిలోకి దిగిన ధోనీ ఆరు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో ఓవర్‌ను సూపర్ ఫాస్ట్‌గా ముగించేసాడు. ఓడిపోతుందనుకున్న చెన్నై.. ధోనీ ఆటతో గెలుపును చవిచూసింది. ఇక ఈ ఆటలో తన హెలికాప్టర్ షాట్‌ను చూసిన ఫ్యాన్స్ పాత ధోనీని మళ్లీ గుర్తుచేసుకున్నారు. సీఎస్‌కే గెలిచింది అన్న ఆనందంలో ధోనీ భార్య సాక్షి తన కూతురు జివాను పట్టుకొని ఎమోషనల్ అవ్వడం ఒక క్యూట్ మూమెంట్‌లాగా నిలిచిపోయింది.
ఓడిపోతుందనుకున్న సీఎస్‌కేను తొమ్మిదోసారి ఫైనల్ రేసులో నిలబెట్టగలిగాడు ధోనీ. తన ఆట చూసిన ఫ్యాన్స్‌లో ఒక పాప ఆనందంతో కంటతడి పెట్టింది. అది తెలుసుకున్న ధోనీ ఆటోగ్రాఫ్ చేసిన బంతిని తనకు గిఫ్ట్‌గా పంపించాడు.