IPL: ఐపీఎల్‌ చరిత్రలో విరాట్‌ మరో రికార్డు

67 హాఫ్​ సెంచరీలు చేసి డేవిడ్‌ వార్నర్‌‌ను దాటేసిన కోహ్లీ;

Update: 2025-04-21 04:30 GMT

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 18 ఎడిషన్ ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచులో కోహ్లీ.. 54 బంతుల్లో 73 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఎవరికీ సాధ్యం కానీ మైలురాయిని చేరుకున్నాడు.ఈ ఇన్నింగ్స్‌ ద్వారా విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 67 సార్లు.. ఫిఫ్టీ ఆ పైచిలుకు స్కోరు సాధించాడు. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్‌ను అధిగమించాడు. డేవిడ్ వార్నర్.. ఐపీఎల్‌లో 66 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. తాజాగా ఛేజ్ మాస్టర్ ఈ రికార్డును బీట్ చేశాడు. ఈ రికార్డులతో కొన్నాళ్లుగా పేలవ ప్రదర్శనతో ఎదురవుతున్న విమర్శలకు విరాట్ చెక్ పెట్టినట్టేనని అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.

‘ఈ ఓటమి చిన్నదే.. పుంజుకుంటాం’

IPL 2025లో తాజాగా జరిగిన మ్యాచులో బెంగళూరు చేతిలో 7 వికెట్ల తేడాతో పంజాబ్ పరాజయం పొందింది. మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. 'ఈ ఓటమి చిన్నదే. నెక్ట్స్ మ్యాచ్ నుంచి తిరిగి పుంజుకుంటాం. మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేయడంలో మేం కొంత ఇబ్బంది పడుతున్నాం. మా తప్పులను సరిచేసుకుని, శారీరకంగా, మానసికంగా బలంగా తిరిగి పుంజుకుంటాం' అని తెలిపాడు.

సిక్సర్లు బాదడంలో రాహుల్‌ రికార్డు

ఢిల్లీ వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ శనివారం ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన భారత ఆటగాడు, మూడవ వేగవంతమైన ఆటగాడిగా నిలిచారు. శనివారం జీటీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 129 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నారు. ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ 159 ఇన్నింగ్స్‌లలో 200 ఐపీఎల్ సిక్సర్లు కొట్టి.. అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన భారతీయుడిగా ఇంతకుముందు రికార్డును కలిగి ఉన్నారు.

Tags:    

Similar News