GUKESH: రజనీకాంత్‌ను కలిసిన గుకేశ్‌

Update: 2024-12-26 08:00 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్‌ను భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్‌ కలిశారు. తల్లిదండ్రులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లిన గుకేశ్‌ తలైవాను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను గ్రాండ్‌ మాస్టర్‌ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. విలువైన సమయాన్ని తనకోసం వెచ్చించిన రజనీకాంత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ‘అమరన్‌’తో సూపర్‌ హిట్‌ను అందుకున్న శివకార్తికేయన్‌ను కూడా గుకేశ్‌ కలిశారు. అతడికి శివకార్తికేయన్‌ ఓ వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు. తన అభిమాన నటుడిని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉందని గుకేశ్‌ అన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన గుకేశ్‌పై సినీ ప్రముఖులు ఇటీవల ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అతడిని అభినందిస్తూ ఇండస్ట్రీలోని అగ్ర నటీనటులు పోస్ట్‌లు పెట్టారు. అలాగే, గుకేశ్‌ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన సినిమాల గురించి పంచుకున్నారు. ‘‘అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటా. ఇష్టమైన చిత్రాలు చాలా ఉన్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ అంటే ఇష్టం. తమిళంలో సూర్య యాక్ట్‌ చేసిన సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ బాగా ఇష్టమని తెలిపాడు. హిందీలో హృతిక్‌ రోషన్‌ మూవీ ‘జిందగీ నా మిలేగీ దోబారా’ అంటే ఇష్టమన్నాడు.

Tags:    

Similar News