WPL: డివైన్ విధ్వంసం.. గుజరాత్ విజయం
గుజరాత్ జెయింట్స్‌పై ఢిల్లీ విజయం... ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్... 20 ఓవర్లలో 209 రన్స్ చేసిన గుజరాత్.. చివరి ఓవర్ వరకూ పోరాడిన ఢిల్లీ
చివరి ఓవర్… ఏడే పరుగులు… స్టేడియం మొత్తం నిశ్శబ్దం…అయితే ఆ నిశ్శబ్దాన్ని చెదరగొట్టింది సోఫీ డివైన్. బ్యాట్‌తోనూ, బంతితోనూ మ్యాచ్‌ను తనవైపు తిప్పుకున్న ఆమె, మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో గుజరాత్ జెయింట్స్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేవలం నాలుగు పరుగుల తేడాతో సాధించిన ఈ విజయం, ఈ సీజన్లోనే అత్యంత ఉత్కంఠభరిత పోరుగా నిలిచింది. గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. సోఫీ డివైన్ అద్భుతంగా ఆడి 42 బంతుల్లో 95 పరుగులు చేసింది. చివరి ఓవర్లో స్నేహ రాణా వేసిన బంతుల్లో వరుసగా 4, 4, 6, 6, 6, 6 బాది ఒక్క ఓవర్లోనే 32 పరుగులు సాధించి మ్యాచ్‌ను మలుపు తిప్పింది. కెప్టెన్ అష్లీ గార్డనర్ కూడా 26 బంతుల్లో 49 పరుగులతో రాణించింది. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ హాట్రిక్‌తో సహా 5 వికెట్లు తీసి ఆకట్టుకుంది. లక్ష్య ఛేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 205 పరుగులకు 5 వికెట్లు మాత్రమే కోల్పోయినా, చివరికి 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. లారా వోల్వార్డ్ 38 బంతుల్లో 77 పరుగులు చేసి పోరాడినా ఫలితం దక్కలేదు. చివరి ఓవర్లో 7 పరుగులు కావాల్సిన సమయంలో సోఫీ డివైన్ కీలక వికెట్లు తీసి గుజరాత్‌కు విజయం అందించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన చేసిన సోఫీ డివైన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో గుజరాత్ జెయింట్స్ రెండు మ్యాచ్‌ల్లో రెండు గెలుపులతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఆరంభం నుంచే దూకుడు
దీంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. తొలి ఓవర్లలోనే పరుగుల వేగం పెంచిన గుజరాత్, పవర్‌ప్లేలో మంచి స్కోరు సాధించింది. అయితే మధ్య ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు వికెట్లు తీయడంతో ఇన్నింగ్స్ కాస్త ఊగిసలాటకు గురైంది. డివైన్ క్రీజులో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆమె షాట్లకు హద్దులే లేకపోయాయి. స్నేహ రాణా వేసిన ఆ ఓవర్లో వరుసగా 4, 4, 6, 6, 6, 6 బాది ఏకంగా 32 పరుగులు రాబట్టింది. ఆ ఒక్క ఓవర్‌తో గుజరాత్ స్కోరు ఒక్కసారిగా 200 మార్కును దాటింది. మరో ఎండ్‌లో కెప్టెన్ గార్డెనర్ కూడా కీలకంగా నిలిచింది. 26 బంతుల్లో 49 పరుగులు చేసిన గార్డనర్, డివైన్‌కు చక్కటి మద్దతిచ్చింది.
నందిని శర్మ హాట్రిక్
ఢిల్లీ బౌలింగ్‌లో నందిని శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకే ఓవర్లో హాట్రిక్‌తో పాటు మొత్తం 5 వికెట్లు తీసి గుజరాత్‌ను కట్టడి చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. అయితే చివరి ఓవర్లో వచ్చిన భారీ పరుగులు, ఢిల్లీపై అదనపు ఒత్తిడిని మోపాయి. **ది**ల్లీ స్పిన్నర్ స్నేహ్ రాణా కోరుకోని రికార్డును సొంతం చేసుకుంది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఒక ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా ఆమె నిలిచింది. గుజరాత్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఆమె ఏకంగా 32 పరుగులు సమర్పించుకుంది. స్నేహ్ బౌలింగ్‌లో.. సోఫీ డివైన్ వరుసగా 4, 4, 6, 6, 6, 6 దంచేసింది. ఇప్పటివరకు దీప్తి శర్మ (28) ఒక ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా ఉంది.