Paris Olympics 2024: భారత్‌కు బిగ్ షాక్.. అంతిమ్ పంగల్ అక్రిడిటేషన్ రద్దు.
అక్రిడిటేషన్ దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు;
ఒలింపిక్స్‌లో మరో భారత రెజ్లర్ల అంతిమ్ పంగల్‌పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అక్రిడిటేషన్ కార్డును దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలతో ఇప్పటికే అమిత్ పంగల్‌కు ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డును రద్దు చేసిన ఒలింపిక్స్ నిర్వహక కమిటీ... ఇప్పుడు తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఒలింపిక్స్ నిర్వహక కమిటీ అమిత్ పంగల్‌పై వేటు వేస్తే ఆమె కాంస్య పతక పోరుకు దూరం కావాల్సి ఉంటుంది. అదే జరిగితే భారత రెజ్లర్ల బృందానికి మరో గట్టి షాక్ తగిలినట్లే.
అంతిమ్ ఫ్రీస్టైల్ 53 కేజీల కేటగిరీలో పోటీ పడింది. అయితే, క్వార్టర్స్‌లో తుర్కియే రెజ్లర్ యెట్‌గిల్ చేతిలో పరాజయం చవిచూసింది. అనంతరం ఆమె తన కోచ్‌లు భగత్ సింగ్, వికాస్ ఉంటున్న హోటల్‌కు వెళ్లింది. తన వస్తువులు కొన్ని క్రీడా గ్రామంలో ఉన్నట్లు సోదరి నిశాకు చెప్పి.. తీసుకురమ్మని కోరింది. అందుకుగాను తన అక్రిడిటేషన్ కార్డును ఇచ్చింది. నిశా క్రీడా గ్రామంలోకి వెళ్లి వస్తువులను తీసుకొస్తుండగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొన్నారు. ఆమె నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని పంపించారు. అంతిమ్‌ను కూడా పిలిపించి వివరణ నమోదు చేశారు. ఈ క్రమంలోనే అంతిమ్ అక్రిడిటేషన్ దుర్వినియోగం అయినట్లు భావించిన ఒలింపిక్ నిర్వాహకులు.. దానిని రద్దు చేశారు. మరోవైపు పారిస్‌లో క్యాబ్‌లో ప్రయాణించి సొమ్ము చెల్లించలేదని అంతిమ్ వ్యక్తిగత సిబ్బందిపై పోలీసులకు డ్రైవర్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే, దానిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
అంతిమ్‌పై వేటు పడితే కాంస్య పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయినట్లే. అదే జరిగితే క్వార్టర్స్‌లో ఓడినప్పటికీ.. ‘రెపిఛేజ్’ ద్వారా పోటీలో నిలవాలనే ఆశలకు దీంతో తెరపడనుంది.