ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2031 వరకు ఇంగ్లాండ్‌లోనే జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2019 మొదలవగా.. ఇప్పటివరకు జరిగిన మూడు ఫైనల్స్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. వరల్డ్ టెస్ట్ చాంపియప్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ వేదికను ఐసీసీ మార్చలేదు. గత మూడు ఫైనల్స్‌ను విజయవంతంగా నిర్వహించిన ఇంగ్లండ్‌కే రాబోయే మూడు మెగా ఫైనల్స్ ఆతిథ్య హక్కులను కేటాయించింది. మూడు నెలల క్రితం ముగిసిన ఏజీఎంలో ఐసీసీ నిర్ణయం తీసుకుంది. 2027, 2029, 2031లో డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరుగుతాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం, టెస్ట్ క్రికెట్‌పై ఇంగ్లండ్ అభిమానుల ఆసక్తిని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. ఇండియాలో ఫైనల్స్ నిర్వహించాలని బీసీసీఐ నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ ఐసీసీ ఇంగ్లండ్ బోర్డుకే ఓటు వేసింది.
3 ఐసీసీ ఈవెంట్లకు భారత్ ఆతిథ్యం
2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ పొట్టి సమరానికి ఇప్పటికే 13 జట్లు నేరుగా అర్హత సాధించగా.. యూరప్ క్వాలిఫైయర్ ద్వారా ఇటలీ, నెదర్లాండ్స్ అర్హత సాధించాయి. దీంతో టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించిన జట్ల సంఖ్య 15 కు చేరింది. 2027 వరల్డ్ కప్ లో ఈ సారి మొత్తం 14 జట్లకు ఐసీసీ అవకాశం కల్పించింది. ఈ మెగా టోర్నీ 2003 తరహాలో జరుగుతుందని స్పష్టం చేసింది. మొత్తం 14 జట్లు రెండు గ్రూప్ లుగా విభజించబడతాయి. ఈ మెగా టోర్నీకి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిధ్యమివ్వనున్నాయి. హోస్ట్ కాబట్టి ఈ జట్లు నేరుగా వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తాయి.