WWC: సెమీస్ చేరాలంటే.. గెలిచి తీరాలంతే
నేడు మహిళల ప్రపంచకప్‌లో కీలక పోరు.. న్యూజిలాండ్‌తో టీమిండియా అమీతుమీ.. సెమీస్ చేరాలంటే భారత్ గెలవాలంతే
భారత మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా కీలక మ్యాచుకు సిద్ధమైంది. వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం పాలైన భారత్.. నేడు న్యూజీలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచులో గెలిస్తే భారత సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. పరాజయం పాలైతే భారత్ సెమీస్ ఆశలు సన్నిగిల్లినట్లే. గత మూడు మ్యాచుల్లో చేతుల్లోకి వచ్చిన విజయాలను వదిలేసిన టీమిండియా ఈ మ్యాచులో తప్పులను సరిదిద్దుకుని గెలవాల్సి ఉంది. భారత వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టుకు పెద్దగా కలిసి రాలేదు. మొదటి రెండు మ్యాచ్‌లను మాత్రమే గెలిచింది. తరువాత మూడింట్లో ఓడిపోయింది. దీంతో సెమీస్‌కు వెళ్ళే అవకాశాలను టీమ్ ఇండియా సంక్లిష్టం చేసుకుంది. ఈక్రమంలో గురువారం భారత మహిళల జట్టు న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడనుంది. ఇందులో ఎవరు గెలిస్తే వారు సెమీస్‌కు చేరుకుంటారు. న్యూజిలాండ్ కూడా టాప్ కోసం పోటీ పడే టీమ్‌లలో ఒకటి. ఈమ్యాచ్‌లో కూడా టీమ్ ఇండియా ఓడిపోతే సెమస్ బెర్త్ కష్టమౌతుంది. ఇక చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో టీమ్ఇండియా అక్టోబర్ 26న తలపడనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. మరో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం భారత్ 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు 3 ఓటములతో 4 పాయింట్లతో లీగ్ టేబుల్లో 4వ స్థానంలో కొనసాగుతుంది. ఇక న్యూజిలాండ్ 5 మ్యాచ్‌ల్లో ఒక విజయం.. రెండు ఓటములు.. 2 రద్దుతో 4 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. సెమీస్‌లో నాలుగో బెర్త్ కోసం ఈ రెండు జట్లు కూడా పోటీ పడుతున్నాయి. ఇరు జట్లు కూడా చెరో రెండు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. భారత్ విషయానికి వస్తే.. అక్టోబర్ 23న న్యూజిలాండ్‌తో.. అక్టోబర్ 26న బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.
టీమిండియాకు డూ ఆర్ డై
మ్యాచ్‌లో న్యూజిలాం డ్ ను భారత్ ఓడిస్తే సెమీస్ అవకాశాలు మెరుగు పడుతాయి. ఒకవేళ పరాజయం పాలైతే.. సమీకరణలు చివర జరిగే లీగ్ మ్యాచ్‌పై ఆధారపడ తాయి. అలాకాకుండా భారత్‌ను న్యూజిలాండ్ ఓడించి.. ఇంగ్లండ్ చేతిలో ఓడినా.. భారతజట్టు చివరి లీగ్‌లో బంగ్లాదేశ్‌పై నెగ్గినా.. రన్‌రేట్ కీలకంగా మారనుంది. న్యూజిలాండ్-భారత్ మ్యాచ్ రద్దయితే ఇరుజట్లు ఆడే చివరి లీగ్ మ్యాచ్ ఫలితం కీలకంగా మారనుంది. భారత్, పాక్, లంక జట్లలో ఆరు పాయింట్లు సాధించిన టీమ్ సెమీస్‌కు దూసుకెళ్తుంది.
నాల్గో బెర్త్ రేసులో ఉన టీమిండియాతోపాటు న్యూజిలాండ్, శ్రీలంక జట్లు కూడా 4 పాయింట్లతో ఉన్నాయి. టీమిండియా నెట్రన్ రేటు +0.526గా ఉండగా.. న్యూజిలాండ్(-0.24), శ్రీలంక(-1.03) భారత్‌కంటే వెనుకబడి ఉన్నాయి. టీమిండియా తన చివరి రెండు మ్యాచుల్లో న్యూజిలాండ్, బంగ్లాతో తలపడనుంది. నేడు నవీ ముంబయిలో న్యూజిలాండ్‌తో జరిగే కీలక పోరులో టీమిండియా గెలిస్తే నేరుగా సెమీస్‌కు దూసుకెళ్తుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడితే.. బంగ్లాదేశ్‌పైనా హర్మన్‌ప్రీత్ సేన కచ్చితంగా గెలవాలి. మరోవైపు న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలవ్వాలి. ఒకవేళ.. కివీస్‌తో మ్యాచ్ రద్దయి, బంగ్లాపై టీమిండియా నెగ్గినా చివరి బెర్త్ మనకే దక్కనుంది. శ్రీలంక జట్టు 24న చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. లంక మెరుగైన రన్‌రే ట్ను సాధిస్తే సమీకరణాలు మారుతాయి.