WWC2025: ప్రపంచ రికార్డు సృష్టించి ఫైనల్‌కు..

కంగారు కోటను కూల్చిన టీమిండియా.. సెమీఫైనల్లో భారత్ అద్భుత విజయం.. అజేయ ఆస్ట్రేలియాకు హర్మన్ సేన చెక్.. అద్భుత శతకంతో గెలిపించిన జెమీమా

Update: 2025-10-31 02:00 GMT

ఐసీ­సీ మహి­ళల వన్డే ప్ర­పం­చ­క­ప్ 2025 ఫై­న­ల్‌­కు భా­ర­త్ దూ­సు­కె­ళ్లిం­ది. సె­మీ­ఫై­న­ల్‌­లో 339 పరు­గుల భారీ లక్ష్యా­న్ని ఛే­దిం­చి.. ఆస్ట్రే­లి­యా­ను మట్టి­క­రి­పిం­చిం­ది. జె­మీ­మా రో­డ్రి­గ్స్ అజేయ శత­కా­ని­కి తోడు కె­ప్టె­న్ హర్మ­న్ ప్రీ­త్ సిం­గ్ హాఫ్ సెం­చ­రీ­తో జట్టు­ను వి­జ­య­తీ­రా­ల­కు చే­ర్చా­రు. నవం­బ­ర్ 2న దక్షి­ణా­ఫ్రి­కా­తో ఫై­న­ల్ మ్యా­చ్ జర­గ­నుం­ది. దీం­తో ఫై­న­ల్‌­లో ఏ జట్టు గె­లి­చి­నా అది తొలి జట్టు­గా ని­ల­వ­నుం­ది. నవీ ముం­బై వే­ది­క­గా జరి­గిన సెమీ ఫై­న­ల్‌­లో ఆస్ట్రే­లి­యా భా­ర­త్ ముం­దు 339 పరు­గుల భారీ లక్ష్యా­న్ని ని­ర్దే­శిం­చిం­ది. కానీ అసా­ధా­రణ ప్ర­ద­ర్శన చే­సిన భా­ర­త్.. మరో 9 బం­తు­లు మి­గి­లి ఉం­డ­గా­నే మ్యా­చ్‌­ను ము­గిం­చి ఫై­న­ల్ చే­రిం­ది. మహి­ళల ప్ర­పంచ కప్ చరి­త్ర­లో ఇదే అత్య­ధిక పరు­గుల వేట. జె­మి­మా రో­డ్రి­గ్జ్ అజే­యం­గా 127 పరు­గు­లు, హర్మ­న్‌­ప్రీ­త్ కౌర్ 89 పరు­గు­ల­తో భా­ర­త్ 9 బం­తు­లు మి­గి­లి ఉం­డ­గా­నే లక్ష్యా­న్ని చే­రు­కుం­ది.


కంగారులు దంచేశారు

ఈ మ్యా­చ్‌­లో తొ­లుత బ్యా­టిం­గ్‌ చే­సిన ఆసీ­స్‌ 49.5 ఓవ­ర్ల­లో 338 పరు­గు­ల­కు ఆలౌ­ట్‌ అయిం­ది. ఆసీ­స్ బ్యా­ట­ర్ల­లో ఓపె­న­ర్ లీచ్ ఫీ­ల్డ్ (119; 93 బం­తు­ల్లో 17 ఫో­ర్లు, 3 సి­క్స్‌­లు) దూ­కు­డు­గా ఆడి సెం­చ­రీ బా­దిం­ది. ఎలీ­స్ పె­ర్రీ (77; 88 బం­తు­ల్లో 6 ఫో­ర్లు, 2 సి­క్స్‌­లు) అర్ధ శత­కం­తో రా­ణిం­చిం­ది. లీ­చ్‌­ఫీ­ల్డ్, ఎలీ­స్ పె­ర్రీ రెం­డో వి­కె­ట్‌­కు 155 పరు­గుల భా­గ­స్వా­మ్యం (133 బం­తు­ల్లో) నె­ల­కొ­ల్పా­రు. ఆష్లీ­న్ గా­ర్డ్‌­న­ర్ (63; 45 బం­తు­ల్లో 4 ఫో­ర్లు, 4 సి­క్స్‌­లు) చి­వ­ర్లో మె­రు­పు­లు మె­రి­పిం­చిం­ది. బెత్ మూనీ (24), కిమ్ గా­ర్త్ (17), మె­క్‌­గ్రా­త్ (12) పరు­గు­లు చే­శా­రు. భారత బౌ­ల­ర్ల­లో శ్రీ చరణి 2, దీ­ప్తి శర్మ 2, క్రాం­తి గౌడ్, అమ­న్‌­జ్యో­త్, రాధాతలో వి­కె­ట్ పడ­గొ­ట్టా­రు.

జెమీమా కొత్త చరిత్ర

339 పరు­గుల లక్ష్యా­న్ని భా­ర­త్ 48.3 ఓవ­ర్ల­లో 5 వి­కె­ట్లు కో­ల్పో­యి ఛే­దిం­చిం­ది. జె­మీ­మా రో­డ్రి­గ్స్‌ (127*; 134 బం­తు­ల్లో 14 ఫో­ర్లు) సెం­చ­రీ­తో మె­రి­సిం­ది. కె­ప్టె­న్ హర్మ­న్‌­ప్రీ­త్‌ కౌ­ర్‌ (89; 88 బం­తు­ల్లో 10 ఫో­ర్లు, 2 సి­క్స్‌­లు) శతకం చేసే అవ­కా­శా­న్ని చే­జా­ర్చు­కుం­ది. జె­మీ­మా, హర్మ­న్‌­ప్రీ­త్ మూడో వి­కె­ట్‌­కు 167 పరు­గుల భా­గ­స్వా­మ్యం (156 బం­తు­ల్లో) నె­ల­కొ­ల్పా­రు. దీ­ప్తి శర్మ (24), రిచా ఘోష్ (26), స్మృ­తి మం­ధాన (24), అమ­న్‌­జ్యో­త్ (15*), షె­ఫా­లీ (10) పరు­గు­లు చే­శా­రు. ఆసీ­స్ బౌ­ల­ర్ల­లో అన్నా­బె­ల్ సద­ర్లాం­డ్, కిమ్ గా­ర్త్ రెం­డే­సి వి­కె­ట్లు పడ­గొ­ట్టా­రు. టీ­మ్‌­ఇం­డి­యా ఫై­న­ల్ చే­ర­డం ఇది మూ­డో­సా­రి.




Tags:    

Similar News