బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మూడు రోజు.. భారత బ్యాటర్లు స్థిరంగా రాణిస్తున్నారు. యంగ్ సెన్సేషన్ యశస్వీ జైశ్వాల్.. శతకంతో అద్భుతం చేశాడు. . ఆస్ట్రేలియా బౌలర్లను నిస్సహాయులను చేస్తూ టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్ జైస్వాల్ 161 పరుగులు చేసి మార్ష్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్ పెవిలియన్‌కు చేరారు. భారత్ ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 313 రన్స్ చేసి 359 పరుగుల ఆధిక్యంలో ఉంది. కోహ్లీ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 77 పరుగుల వద్ద స్టార్క్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.
చరిత్ర సృష్టించిన రాహుల్-జైస్వాల్ జోడీ
బీజీటీ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత ఓపెనింగ్ జోడీ రాహుల్- జైస్వాల్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై 200కుపైగా పరుగులు జోడించిన తొలి భారత ఓపెనింగ్ జోడీగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచులో కేఎల్ రాహుల్- యశస్వీ జైస్వాల్ తొలి వికెట్ కు 201 పరుగులు జోడించారు. 1986 సిడ్నీ టెస్టులో గవాస్కర్-క్రిస్ శ్రీకాంత్ జోడీ 191 పరుగులు చేసింది. ఈ రికార్డును రాహుల్-యశస్వీ బ్రేక్ చేసింది.
నేడే ఐపీఎల్ మెగా వేలం
IPL మెగా వేలం ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. జెడ్డా (సౌదీ అరేబియా) వేదికగా నేడు, రేపు నిర్వహించనున్న ఈ వేలంలో దాదాపుగా 577 మంది క్రికెటర్లు పాల్గొంటారు. ఇందులో 367మంది భారత ప్లేయర్లు ఉండగా విదేశీయులు 210 మంది ఉన్నారు. కాగా, ఇందులో కేవలం 204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఈ తరహా మెగా వేలం ప్రతీ మూడేళ్లకి ఒకసారి జరుగుతుంది.