YOGRAJ SINGH: యువరాజ్‌కు వెన్నుపోటు పొడిచారు

యువీ తండ్రి సంచలన ఆరోపణలు

Update: 2025-09-07 07:00 GMT

డా­షిం­గ్ బ్యా­ట­ర్ యు­వ­రా­జ్‌ సిం­గ్‌­కు తగి­నంత గు­ర్తిం­పు రా­క­పో­వ­డా­ని­కి ధో­నీ­నే కా­ర­ణ­మ­ని యు­వ­రా­జ్ తం­డ్రి యో­గ్‌­రా­జ్ సిం­గ్ తర­చు­గా ఆరో­పి­స్తుం­టా­రు. తా­జా­గా ధో­నీ­తో పాటు వి­రా­ట్ కో­హ్లీ­పై కూడా యో­గ్‌­రా­జ్ సం­చ­లన ఆరో­ప­ణ­లు చే­శా­రు. 'ఒ­క­రు ఎదు­గు­తుం­టే వె­న్ను­పో­టు పొ­డి­చే వారు ఎం­ద­రో ఉం­టా­రు. యు­వ­రా­జ్ సిం­గ్ అంటే చాలా మంది భయ­ప­డ్డా­రు. తమ స్థా­నం ఎక్కడ లా­గే­సు­కుం­టా­డో అని వా­రి­కి భయం. యు­వ­రా­జ్ చాలా గొ­ప్ప క్రి­కె­ట­ర్. అం­దు­కే అత­డి­ని చూసి స్వంత జట్టు­లో­ని వారే భయ­ప­డి వె­న్ను­పో­టు పొ­డి­చా­రు. ధో­నీ­తో సహా చాలా మం­ది­కి యువీ అంటే భయం' అని యో­గ్‌­రా­జ్ తా­జా­గా ఇచ్చిన ఓ ఇం­ట­ర్వ్యూ­లో పే­ర్కొ­న్నా­రు. 'ఇ­క్కడ ని­జ­మైన స్నే­హా­లు ఉం­డ­వు. డబ్బు, వి­జ­యం, పేరు ప్ర­ఖ్యా­త­ల­కే వి­లువ ఎక్కువ. కె­రీ­ర్ ఆరం­భం­లో యువీ అంటే ఎంతో ఇష్ట­ప­డిన కో­హ్లీ ఆ తర్వాత మా­రి­పో­యా­డు. కో­హ్లీ కె­ప్టె­న్‌­గా ఉన్న­ప్పు­డు యు­వీ­కి పె­ద్ద­గా అవ­కా­శా­లు కల్పిం­చ­లే­దు. కో­హ్లీ సపో­ర్ట్ చేసి ఉంటే యువీ మరింత కాలం ఆడే­వా­డు' అని యో­గ్‌­రా­జ్ పే­ర్కొ­న్నా­రు.

అయి­తే గతం­లో­నే యు­వ­రా­జ్ తన తం­డ్రి వ్యా­ఖ్య­ల­ను ఖం­డిం­చా­డు. ధోనీ, కో­హ్లీ తనకు ఎంత సహా­యం చే­యా­లో అంతా చే­శా­ర­ని ఓ ఇం­ట­ర్వ్యూ­లో వె­ల్ల­డిం­చా­డు. యూవీ 6 బం­తు­ల­కు ఆరు సి­క్సు­లు కొ­ట్టి చరి­త్ర సృ­ష్టిం­చా­డు.

కేరళ క్రికెట్ లీగ్‌లో బ్యాటర్ టైమ్డ్ అవుట్

కేరళ క్రి­కె­ట్‌ లీ­గ్‌-2025లో అసా­ధా­రణ ఘటన జరి­గిం­ది. ఈ ఫా­ర్మా­ట్‌ చరి­త్ర­లో తొ­లి­సా­రి ఓ బ్యా­ట­ర్‌ టై­మ్డ్‌ ఔట్‌ అయ్యా­డు. కా­లి­క­ట్‌ గ్లో­బ్‌­స్టా­ర్స్‌­తో జరి­గిన మ్యా­చ్‌­లో కొ­చ్చి బ్లూ టై­గ­ర్స్‌ ఆట­గా­డు అల్ఫీ ఫ్రా­న్సి­స్‌ జా­న్‌ టై­మ్డ్‌ ఔట్‌ అయ్యా­డు. ని­బం­ధ­నల ప్ర­కా­రం​ ఓ ఆట­గా­డు ఔట­య్యాక 90 సె­కె­న్ల­లో­పు మరో ఆట­గా­డు క్రీ­జ్‌­లో­కి రా­వా­ల్సి ఉం­టుం­ది. అయి­తే అల్ఫీ ని­ర్దే­శిత సమ­యా­న్ని దా­టాక క్రీ­జ్‌­లో­కి వచ్చా­డు. ఇది గమ­నిం­చిన కా­లి­క­ట్‌ బౌ­ల­ర్లు ఫీ­ల్డ్‌ అం­పై­ర్‌­కు అప్పీ­ల్‌ చే­శా­రు. పలు మా­ర్లు పరి­శీ­లిం­చిన అనం­త­రం అం­పై­ర్‌ అల్ఫీ­ని ఔట్‌­గా ప్ర­క­టిం­చా­డు.

Tags:    

Similar News