IPL: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సూర్య భాయ్

మార్చి 23న చెన్నైతో తొలి మ్యాచ్.. తొలి మ్యాచ్‌కు పాండ్యా దూరం;

Update: 2025-03-16 02:30 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌‌‌‌ను ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ప్రారంభించనుంది. మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో ముంబై తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది. మార్చి 23న చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. అతనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మొదటి మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించిన విషయం తెలిసిందే.

సన్‌రైజర్స్‌కు శుభవార్త

ఐపీఎల్-2025కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుడ్‌న్యూస్ అందింది. ఆ జట్టు ఆటగాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి యో-యో టెస్టు పాసయ్యాడు. బెంగ‌ళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో నిర్వహించిన ఈ టెస్టులో నితీశ్ 18.1 పాయింట్లు సాధించాడు. దీంతో ఇవాళ నితీశ్‌కుమార్‌ రెడ్డి SRH జట్టుతో చేరనున్నాడు. ఐపీఎల్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన నితీశ్ 303 పరుగులు చేసి.. 3 వికెట్లు తీశాడు. కాగా, ఇంగ్లాండ్‌తో జనవరిలో జరిగిన టీ20 సిరీస్‌లో నితీశ్ గాయపడ్డాడు.

ప్రతి ఒక్కరినీ సమానంగా చూస్తాం: RCB కోచ్

తమ జట్టులో స్వదేశీ, విదేశీ ప్లేయర్లందరినీ సమానంగా చూస్తామని రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్ దినేశ్‌ కార్తీక్‌ అన్నారు. ‘ఇప్పటివరకు నేను చేసిన వాటికి కోచ్ పాత్ర భిన్నమైనది. వేలం నుంచే జట్టుకు సంబంధించి సన్నద్ధతపై అవగాహన తెచ్చుకున్నా. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగంపై దృష్టిసారించా. ఇప్పుడీ జట్టును చూస్తుంటే బాగుంది. పేపర్‌ మీద ఇతర జట్లూ మంచిగానే ఉన్నా మైదానంలో ఎవరు బాగా ఆడితే వారిదే విజయం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ద్రవిడ్‌పై సంజు శాంసన్ కీలక వ్యాఖ్యలు

రాజస్థాన్ మెంటర్ రాహుల్ ద్రవిడ్‌పై ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘RR ఫ్యామిలీలో ద్రవిడ్ ఎప్పుడు భాగమే. ఆయన మళ్లీ రావడం ఆనందంగా ఉంది. ఆటగాళ్లకు మద్దతుగా నిలిచే సారథి. ద్రవిడ్ కెప్టెన్సీలో RRకు ఆడా. ఆయన కోచింగ్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించా. ఇప్పుడు నేను కెప్టెన్‌గా ఉండగా ఆయన కోచ్‌గా వచ్చారు. చాలా విషయాలను నేర్చుకొనే అవకాశం నాకు వచ్చింది’ అని సంజు చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News