భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నాపూరం సమీంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో పలువురు..;
మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నాపూరం సమీంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చెందారు. ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు తప్పించుకున్నారు. వారి కోసం కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు పోలీసులు...
దట్టమైన అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి ఏడుగంటలకు పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తరువాత ఆ ప్రాంతంలో గాలించగా.. సంఘటనా ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు, మరో మిలీషియన్ కమాండర్ ఉన్నారు. మృతదేహాల దగ్గర ఒక 8 ఎంఎం రైఫిల్, పేలుడుకు ఉపయోగించే సామగ్రి, ఒక కిట్ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. .
జిల్లాలో ఇరవై రోజుల వ్యవధిలో జరిగిన మూడు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడంతో రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 8కి చేరింది.