TS corona cases : తెలంగాణలో కొత్తగా 993 కేసులు, 9 మరణాలు
TS corona cases : తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.;
TS corona cases : తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న లక్షా 12 వేల 982 శాంపిల్స్‌ను పరిక్షించగా... కేవలం 993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 124 మంది వైరస్ బారినపడ్డారు. ఒక్కరోజులోనే 9 మంది కరోనా కారణంగా మరణించినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తెలంగాణలో ఇప్పటివకు 6 లక్షల 21 వేల 606 కేసులు నమోదు కాగా... 3 వేల 644 మంది మృత్యువాత పడ్డారు. ఇక 24 గంటల్లోనే కరోనా నుంచి కోలుకుని 14 వందల 17 మంది రికవరీ అయ్యారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 13 వేల 869 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.