Hyderabad: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి.. ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో..
Hyderabad: ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులకు హైదరాబాద్‌లో మరో యువకుడు బలైపోయాడు.;
Hyderabad: ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులకు హైదరాబాద్‌లో మరో యువకుడు బలైపోయాడు. జియాగుడకు చెందిన రాజ్‌కుమార్ ఆన్‌లైన్ యాప్‌లో 12 వేలు తీసుకున్నాడు. 4 వేలు EMIగా చెల్లించాడు. మిగతా డబ్బు విషయంలో ఆలస్యం చేశాడు. దీంతో.. లోన్ తీసుకునే టైమ్‌లో రిఫరెన్స్‌గా ఇచ్చిన కాంటాక్ట్ నంబర్ల వారికి.. యాప్ నిర్వాహకులు మెసేజ్‌లు, కాల్స్ చేస్తున్నారు. బూతులు తిడుతున్నారు. దీన్ని అవమానంగా భావించి తీవ్ర మనస్తాపానికి గురైన రాజ్‌కుమార్ సూసైడ్ చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయాడు.