సోషల్ మీడియాలో ఫేక్ జీవో పెట్టిన నిందితుడి అరెస్ట్..!
సోషల్ మీడియాలో ఫేక్ జీవో పెట్టిన నిందితుడికి హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. నిందితుడు శ్రీపతి సంజీవ్‌కుమార్‌ను టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.;
సోషల్ మీడియాలో ఫేక్ జీవో పెట్టిన నిందితుడికి హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. నిందితుడు శ్రీపతి సంజీవ్‌కుమార్‌ను టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి కీలక డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చార్టెడ్ అకౌంటెడ్‌గా పనిచేస్తున్న సంజీవ్‌కుమార్ ఏప్రిల్ 1న ఫేక్ జీవో రూపొందించాడని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఆన్‌లైన్‌లో జీవోను డౌన్‌లోడ్ చేసుకుని మార్ఫింగ్ చేసి నకిలీ జీవోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడని చెప్పారు. ఫేక్ జీవో వల్ల బిజినెస్ దగ్గర నుంచి లా అండ్ ఆర్డర్ వరకు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మొద్దని సీపీ అంజనీకుమార్ ప్రజలకు సూచించారు.