బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటలో రూ.18.90లక్షలు..!
యావత్ తెలంగాణ రాష్ట్రం ఉత్కంఠగా ఎదురచూసిన.. బాలాపూర్ గణేశుడి లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది.;
యావత్ తెలంగాణ రాష్ట్రం ఉత్కంఠగా ఎదురచూసిన.. బాలాపూర్ గణేశుడి లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. బాలాపూర్ ముఖ్యకూడలిలో ఉత్కంఠగా సాగిన వేలంపాటలో18 లక్షల 90వేలకు మర్రి శశాంక్‌రెడ్డి, రమేశ్ యాదవ్ సొంత చేసుకున్నారు. బాలాపూర్ గణేష్ లడ్డూ దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.. తొలుత 1994లో మొదటిసారి బాలాపూర్ గణేశుడి లడ్డూకు వేలం పాట ప్రారంభమైంది. 1994లో కొలను మోహన్ రెడ్డి బాలాపూర్ లడ్డూను 450 రూపాయలకు దక్కించుకున్నారు. అనంతరం ప్రతి ఏడాది వేలంపాటలో అత్యధిక ధర పలుకుతూ వచ్చింది. 2016లో బాలాపూర్ లడ్డూను మేడ్చల్‌కు చెందిన స్కైలాబ్ రెడ్డి 14 లక్షల 65 వేల ర 60 వేలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు 2019లో 17 లక్షల 60 వేల రూపాయల రికార్డు ధరకు కొలను రాంరెడ్డి దక్కించుకున్నారు..