మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. బుధవారం మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన అన్నాదమ్ములు 12 ఏళ్ల రెహమాన్, 10 ఏళ్ల అమీర్ అదృశ్యమయ్యారు. చాలాసేపైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు ఊరంతా వెతికారు. నిన్నటి నుంచి ఇద్దరు పిల్లలు కనిపించకపోవడంతో.. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అన్ని చోట్లా వెతికి.. చివరికి చేగుంట పోలీస్ స్టేషన్‌లో తండ్రి సమియుద్దీన్ ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.