BYPOLL: నేడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ... 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ... 22వ తేదీన నామినేషన్ల పరిశీలన,24న విత్ డ్రా

Update: 2025-10-13 03:00 GMT

జూ­బ్లీ­హి­ల్స్ అసెం­బ్లీ ని­యో­జ­క­వ­ర్గ ఉప ఎన్నిక నో­టి­ఫి­కే­ష­న్ నేడు వి­డు­ద­ల­కా­నుం­ది. ఎన్ని­కల సంఘం నేడు ఎన్ని­కల గె­జి­ట్ నో­టి­ఫి­కే­ష­న్ వి­డు­దల చే­య­ను­న్న­ది. ఈరో­జు ప్రా­రం­భం కా­ను­న్న నా­మి­నే­ష­న్ల ప్ర­క్రియ 21వ తేదీ వరకు కొ­న­సా­గ­నుం­ది. 22 న నా­మి­నే­ష­న్లు పరి­శీ­లన కాగా.. 24 వరకు నా­మి­నే­ష­న్ల ఉప­సం­హ­ర­ణ­కు అవ­కా­శం ఇవ్వ­ను­న్నా­రు. నా­మి­నే­ష­న్ల స్వీ­క­ర­ణ­కు సర్వం సి­ద్ధం చే­సిన జి­ల్లా ఎన్ని­కల సంఘం. షేక్ పేట్ తహ­సి­ల్దా­ర్ కా­ర్యా­ల­యం­లో రి­ట­ర్నిం­గ్ అధి­కా­రి కా­ర్యా­ల­యం ఏర్పా­టు చే­శా­రు. జి­ల్లా ఎన్ని­కల అధి­కా­రి ఆర్ వి కర్ణ­న్ రి­ట­ర్నిం­గ్ అధి­కా­రి కా­ర్యా­ల­యం­లో ఏర్పా­ట్ల­ను పరి­శీ­లిం­చా­రు. . జూ­బ్లీ­హి­ల్స్‎­లో మొ­త్తం 4 లక్షల ఓట­ర్లు ఉన్నా­ర­ని..  కేం­ద్ర ఎన్ని­కల సంఘం గు­ర్తిం­చిన ఐడీ కా­ర్డు­ల­తో ఓట­ర్లు తమ ఓటు హక్కు వి­ని­యో­గిం­చు­కో­వ­చ్చ­ని ఆర్ వి కర్ణ­న్ స్ప­ష్టం చే­శా­రు. 2025, నవం­బ­ర్ 14న యూ­స­ఫ్ గూ­డ­లో­ని కో­ట్ల వి­జ­య్ భా­స్క­ర్ స్టే­డి­యం­లో ఓట్ల లె­క్కిం­పు ప్ర­క్రియ చే­ప­డ­తా­మ­ని తె­లి­పా­రు. ఎన్ని­క­కు సం­బం­ధిం­చి తప్పు­డు సమా­చా­రం వ్యా­ప్తి చేసే వా­రి­పై కఠిన చర్య­లు తీ­సు­కుం­టా­మ­ని హె­చ్చ­రిం­చా­రు. సరి­ప­డా ఈవీ­ఎం­లు అం­దు­బా­టు­లో ఉన్నా­య­ని.. ఫస్ట్ లె­వె­ల్ ఈవీ­ఎం చె­కిం­గ్ కూడా పూ­ర్త­యిం­ద­ని వె­ల్ల­డిం­చా­రు. రా­జ­కీయ పా­ర్టీ­లు ఎన్ని­కల కోడ్ తప్ప­కుం­డా పా­టిం­చా­ల­ని.. మీ­డి­యా కూడా ఎలాం­టి ఫేక్ న్యూ­స్ టె­లి­కా­స్ట్ చే­య­వ­ద్ద­ని రి­క్వె­స్ట్ చే­స్తు­న్నా­మ­న్నా­రు. అభ్య­ర్థు­లు తప్ప­కుం­డా తమపై ఉన్న కే­సుల వి­వ­రా­ల­ను న్యూ­స్ పే­ప­ర్లు, న్యూ­స్ చా­నె­ల్స్‎­లో పబ్లి­ష్ చే­యా­ల­ని సూ­చిం­చా­రు. సి­కిం­ద్రా­బా­ద్ ఆర్డిఓ సా­యి­రాం రి­ట­ర్నిం­గ్ అధి­కా­రి­గా నా­మి­నే­ష­న్లు స్వీ­క­రిం­చ­ను­న్నా­రు. వచ్చే­నెల 11 ఉప ఎన్నిక పో­లిం­గ్ జర­గ­ను­న్న­ది. పో­లిం­గ్ అనం­త­రం 14వ తే­దీన ఓట్ల కౌం­టిం­గ్ చే­య­ను­న్నా­రు.

అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే

జూ­బ్లీ­హి­ల్స్ ని­యో­జ­క­వ­ర్గా­ని­కి జరి­గే ఉప ఎన్ని­క­ను తె­లు­గు­దే­శం పా­ర్టీ, భా­ర­తీయ జన­తా­పా­ర్టీ, జన­సేన పా­ర్టీ­లు ట్ర­య­ల్ గా ఉప­యో­గిం­చు­కుం­టు­న్నా­యి. కాం­గ్రె­స్ తర­ఫున నవీ­న్ యా­ద­వ్, భారత రా­ష్ట్ర సమి­తి తర­ఫున సు­నీత బరి­లో ని­లి­చా­రు. బీ­జే­పీ అభ్య­ర్థి ఇంకా ఖరా­ర­వ్వ­లే­దు. ఢి­ల్లీ­లో ఎం­పిక జర­గ­నుం­ది. బీ­జే­పీ అభ్య­ర్థి కూడా ఖరా­రైన తర్వాత ఒక్క­సా­రి­గా రా­జ­కీ­యం వే­డె­క్కే అవ­కా­శం ఉంది. రా­ను­న్న అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో గె­లి­చి ఎలా­గై­నా తె­లం­గా­ణ­లో అధి­కా­రం చే­ప­ట్టా­ల­ని బీ­జే­పీ ఉవ్వి­ళ్లూ­రు­తోం­ది. బండి సం­జ­య్ ను పా­ర్టీ అధ్య­క్షు­డి­గా తొ­ల­గిం­చ­కుం­డా అలా­గే ఉం­చి­తే మొ­న్న­టి ఎన్ని­క­ల్లో­నే ఆ పా­ర్టీ అధి­కా­రం చే­ప­ట్ట­డా­ని­కి ఎక్కువ అవ­కా­శం ఉం­డే­ది. కానీ బీ­జే­పీ వారే తమ పా­ర్టీ­ని చం­పే­సు­కు­న్నా­రు. దీ­ని­వె­నక అనేక రా­జ­కీయ కా­ర­ణా­లు­న్నా­యి. ఏపీ­లో టీ­డీ­పీ-బీ­జే­పీ-జన­సేన కలి­సి కూ­ట­మి­గా ప్ర­భు­త్వా­న్ని ఏర్పా­టు చే­శా­యి. టీ­డీ­పీ-జన­సేన ఎం­పీ­లు కేం­ద్రం­లో బీ­జే­పీ­కి మద్ద­తి­చ్చా­రు. వీరి మద్ద­తే కేం­ద్ర ప్ర­భు­త్వా­ని­కి కీ­ల­కం­గా మా­రిం­ది. ఇలా­గే కూ­ట­మి­ని తె­లం­గాణ అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో కూడా కొ­న­సా­గి­ద్దా­మ­ని ఈ మూడు పా­ర్టీ­లు భా­వి­స్తు­న్నా­యి. ఈ పా­ర్టీ­లు సత్తా చా­టి­తే భవి­ష్య­త్తు రా­జ­కీయ పరి­ణా­మా­లు మారే అవ­కా­శం ఉంది.

Tags:    

Similar News