BYPOLL: జోరందుకోనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం

నవంబర్‌ 11న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక  పోలింగ్‌

Update: 2025-10-07 02:30 GMT

తె­లం­గా­ణ­లో జూ­బ్లీ­హి­ల్స్‌ అసెం­బ్లీ స్థా­నా­ని­కి ఉప ఎన్నిక షె­డ్యూ­ల్‌ వి­డు­ద­లైం­ది. నవం­బ­ర్‌ 11న ఉప ఎన్నిక ని­ర్వ­హిం­చ­ను­న్న­ట్లు ఈసీ వె­ల్ల­డిం­చిం­ది. నవం­బ­ర్‌ 14న ఓట్ల లె­క్కిం­పు చే­ప­ట్ట­ను­న్నా­రు. జూ­బ్లీ­హి­ల్స్‌ పరి­ధి­లో మొ­త్తం 3,92,669 మంది ఓట­ర్లు ఉన్నా­రు. మా­గం­టి గో­పీ­నా­థ్‌ అకాల మర­ణం­తో ఇక్కడ ఉప ఎన్నిక ని­ర్వ­హి­స్తు­న్నా­రు.

* నోటిఫికేషన్‌ విడుదల: అక్టోబర్‌ 13

* నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్‌ 21

* నామినేషన్ల పరిశీలన: అక్టోబర్‌ 22

* నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: అక్టోబర్‌ 24

* పోలింగ్‌ తేదీ: నవంబర్‌ 11

* ఓట్ల లెక్కింపు : నవంబర్‌ 14

జోరందుకోనున్న ప్రచారం

తె­లం­గా­ణ­లో జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్నిక షె­డ్యూ­ల్ ను ఎన్ని­కల సంఘం వి­డు­దల చే­య­డం­తో అన్ని పా­ర్టీ­లు ప్ర­చా­రం గేర్ మా­ర్చా­యి. ఈ ఉప ఎన్ని­క­ల్లో సత్తా చా­టా­ల­ని అన్ని పా­ర్టీ­లు పట్టు­ద­ల­గా ఉన్నా­యి. సి­ట్టిం­గ్ స్థా­నా­న్ని గె­లి­పిం­చు­కో­వా­ల­ని బీ­ఆ­ర్ఎ­స్.. ఈ సీటు గె­లి­చి సత్తా చా­టా­ల­ని కాం­గ్రె­స్ వ్యూహ రచన చే­స్తు­న్నా­యి. షె­డ్యూ­ల్ రా­వ­డం­తో జూ­బ్లీ­హి­ల్స్ లో ప్ర­చా­రం జోరు మరింత పె­ర­గ­నుం­ది. సి­ట్టిం­గ్‌ ఎమ్మె­ల్యే మా­గం­టి గో­పీ­నా­థ్‌ మృ­తి­తో ఉప ఎన్నిక అని­వా­ర్యం అయ్యిం­ది. జూ­బ్లీ­హి­ల్స్‌ బై ఎల­క్ష­న్‌­ను ప్ర­ధాన పా­ర్టీ­లు ప్ర­తి­ష్టా­త్మ­కం­గా తీ­సు­కు­న్నా­యి. ఇప్ప­టి­కే బీ­ఆ­ర్‌­ఎ­స్‌ అభ్య­ర్థి­ని ప్ర­క­టిం­చిం­ది. మా­గం­టి గో­పీ­నా­థ్‌ భా­ర్య సు­నీ­త­ను బరి­లో­కి దిం­చిన బీ­ఆ­ర్‌­ఎ­స్‌.. సి­ట్టిం­గ్‌ స్థా­నా­న్ని దక్కిం­చు­కో­వా­ల­న్న పట్టు­ద­ల­తో ఉంది. జూ­బ్లీ­హి­ల్స్ ని­యో­జ­క­వ­ర్గం­లో మొ­త్తం ఓట­ర్ల సం­ఖ్య 3,99,000 కాగా, జూలై 1, 2025ను అర్హత తే­దీ­గా తీ­సు­కు­ని సవ­రిం­చిన జా­బి­తా­లో 2,07,382 మంది పు­రు­షు­లు, 1,91,593 మంది మహి­ళ­లు, 25 మంది ట్రా­న్స్‌­జెం­డ­ర్ ఓట­ర్లు ఉన్నా­రు. . లింగ ని­ష్ప­త్తి ప్ర­తి వె­య్యి పు­రు­షు­ల­కు 924 మహి­ళ­లు­గా ఉంది.  ఈ జా­బి­తా­లో 6,106 మంది యువ ఓట­ర్లు (18–19 సం­వ­త్స­రా­లు), 2,613 మంది వృ­ద్ధు­లు (80 ఏళ్లు పై­బ­డిన వారు), అలా­గే 1,891 మంది వి­క­లాం­గు­లు ఉన్నా­రు. జూ­బ్లీ­హి­ల్స్ ని­యో­జ­క­వ­ర్గం­లో ఉపఎ­న్నిక ని­ర్వ­హ­ణ­కు 139 కేం­ద్రా­ల్లో 407 పో­లిం­గ్ స్టే­ష­న్లు ఏర్పా­టు చే­శా­రు.

Tags:    

Similar News