BYPOLL: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా విక్రమ్‌గౌడ్..?
మెగాస్టార్‌తో బీజేపీ చీఫ్ భేటీ
జూబ్లీహిల్స్ఉప ఎన్నికల్లో కమలనాథులు బీసీ వర్గానికి చెందిన యువనేత పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అనూహ్యంగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్తనయుడు విక్రమ్గౌడ్పేరు తెర మీదికి వచ్చింది. ఆయన సీనియర్లతో టచ్‌లో ఉన్నట్ల టాక్వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన విక్రమ్ గౌడ్ టికెటు కోసం ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం ఫెయిల్అయితే ఉప ఎన్నికల్లో బీసీలకే టికెట్లు ఇచ్చామనే ప్రచారం చేసుకునేందుకు నవీన్‌యాదవ్‌కు ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ ఉందనే విమర్శలకు చెక్‌పెట్టేందుకు బీసీ నేతకు టికెట్లు ఇచ్చేందుకు పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది.
ఉప ఎన్నికల్లో 200 నామినేషన్లు
తెలంగాణలో ఉప ఎన్నిక కాక రేపుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం జిల్లాల వారీగా 200 మంది మాలలు నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలంగాణ మాల సంఘాల జేఏసీ ప్రకటించింది. తెలంగాణలో ఆరు నెలలుగా జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎస్సీలోని 58 కులాలకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొంది. కాంగ్రెస్‌ను ఓడించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ ఛైర్మన్ మందాల భాస్కర్ వెల్లడించారు. ఇది కాంగ్రెస్‌తో పాటు మిగిలిన పార్టీలను ఆందోళన పరుస్తోంది.
చిరంజీవిని కలిసిన బీజేపీ అధ్యక్షుడు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఆయన కుటుంబం సినీ నటుడు చిరంజీవిని, నయనతారను షూటింగ్ స్పాట్లో కలిశారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తన మనవరాలు ఐరా ఆశీష్ కోరిక మేరకు వారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినీ విశేషాలు, సమకాలీన రాజకీయాలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. తమకు సమయం కేటాయించిన చిరంజీవికి రామచంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవితో పాటు హీరోయిన్ నయనతారను కూడా రామచందర్ రావు కుటుంబ సభ్యులు కలిశారు. చిరంజీవితో జరిగిన సమావేశంలో సినిమా విశేషాలతో పాటు, సమకాలీన రాజకీయాలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు ఆలోచనలు పంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.