KCR Bihar Tour : కేసీఆర్ బిహార్ టూర్.. జాతీయ రాజకీయాలపై ఫోకస్..
KCR Bihar Tour : జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు;
KCR Bihar Tour : జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈనెల 31న సీఎం కేసీఆర్ బీహార్‌లో పర్యటించనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు గాల్వాన్‌లో అమరులైన ఐదుగురు బీహార్‌కు చెందిన సైనికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేయనున్నారు సీఎం కేసీఆర్. అలాగే ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్నిప్రమాదంంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికులకు కుటుంబాలకు ఆర్థికసాయం అందజేయనున్నారు.
బీహార్ సీఎం నితీష్‌కుమార్‌తో కలిసి వలస కార్మిక, సైనిక కుటుంబాలకు సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం నితీష్‌కుమార్ ఇంటికి వెళ్లనున్న కేసీఆర్.. ఆయనతో కలిసి లంచ్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమంలో జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.