ఫిబ్రవరి 24 నుంచి మేడారం మినీ జాతర!
మేడారం మినీ జాతర (మండ మెలిగే పండగ) తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు జాతర జరుగుతుందని పూజారులు ప్రకటించారు.;
మేడారం మినీ జాతర (మండ మెలిగే పండగ) తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు జాతర జరుగుతుందని పూజారులు ప్రకటించారు. ఫిబ్రవరి 24న గుడిశుద్ధి, పూజా కార్యక్రమాలు ఉంటాయి. అదే రోజు ఉదయం గ్రామ నిర్బంధం చేస్తారు. 25 న సమ్మక్క-సారలమ్మలకు పసుపు, కుంకుమతో అర్చన చేస్తారు. 26న భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకోవచ్చు. 27న అమ్మవార్ల పూజ కార్యక్రమాల ముగింపుతో మినీ జాతర ముగుస్తుంది. ఈ జాతరకు సంబంధించిన పూర్తి వివరాలను ఆలయ ఈవోకు తెలియజేశారు.