హైదరాబాద్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు.. జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు పాల్గొన్నారు.;
హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పథకాన్ని గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు పాల్గొన్నారు.
దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు గవర్నర్ తమిళిసై. అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని తెలిపారు. గతేడాదంతా కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో కష్టంగా గడిచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని తమిళిసై తెలిపారు.