CM REVANTH: మహిళలను వేధిస్తే వదిలి పెట్టం: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి

సైబరాసురులకు గట్టి హెచ్చరిక

Update: 2026-03-08 04:30 GMT

మహి­ళ­లు ధై­ర్యం­గా ఉద్యోగ, ఉపా­ధి అవ­కా­శా­ల­ను వి­ని­యో­గిం­చు­కో­వా­ల­ని.. ఎక్క­డై­నా మహి­ళ­ల­పై వే­ధిం­పు­లు జరి­గి­తే ని­ల­బ­డి ప్ర­శ్నిం­చే ధై­ర్యం సమా­జం­లో రా­వా­ల­ని సీఎం రే­వం­త్ రె­డ్డి సూ­చిం­చా­రు.. కా­లే­జీ­లు, బస్టాం­డ్లు సహా ఎక్క­డై­నా జరి­గే వే­ధిం­పు­ల­ను చూసి చూ­డ­న­ట్టు ఉం­డ­టం కూడా నే­రా­న్ని ప్రో­త్స­హిం­చ­డ­మే అన్నా­రు. సో­ష­ల్ మీ­డి­యా ద్వా­రా మహి­ళ­ల­పై సై­బ­ర్ వే­ధిం­పు­లు పె­రు­గు­తు­న్నా­య­ని.. మహి­ళ­ల­పై మా­ర్ఫిం­గ్, ఫేక్ వీ­డి­యో­లు వంటి సై­బ­ర్ నే­రా­ల­పై కఠిన చర్య­లు తీ­సు­కుం­టా­మ­న్నా­రు. మహి­ళ­ల­కు సీఎం రే­వం­త్‌­రె­డ్డి అం­త­ర్జా­తీయ మహి­ళా ది­నో­త్స­వం శు­భా­కాం­క్ష­లు తె­లి­పా­రు. మహి­ళా ది­నో­త్స­వం జరు­పు­కుం­టే­నే బా­ధ్యత తీ­రి­పో­యి­న­ట్టు కా­ద­న్నా­రు.. మహిళ నా­య­క­త్వం నుం­చి వచ్చిన పా­ర్టీ ద్వా­రా రా­ష్ట్రం­లో ప్ర­భు­త్వా­న్ని ఏర్పా­టు చే­శా­మ­ని ఆయన తె­లి­పా­రు. మహి­ళా రా­ష్ట్ర­ప­తి బి­ల్లు ఆమో­దం చే­య­డం ద్వా­రా తె­లం­గాణ రా­ష్ట్రం ఏర్పా­ట­యిం­ద­ని చె­ప్పా­రు. దే­శం­లో అనేక రా­ష్ట్రా­ల్లో ము­ఖ్య­మం­త్రు­లు ఇతర ఉన్నత వి­భా­గా­ల్లో పని­చే­సే­లా మహి­ళ­ల­కు అవ­కా­శం కల్పిం­చిన 140 సం­వ­త్స­రాల చరి­త్ర గల పా­ర్టీ కాం­గ్రె­స్ పా­ర్టీ అని కొ­ని­యా­డా­రు.

మహి­ళల రక్షణ కే­వ­లం ప్ర­భు­త్వ బా­ధ్యత మా­త్ర­మే కా­ద­ని, సమా­జం­లో­ని ప్ర­తి ఒక్క­రూ దీ­ని­ని తమ బా­ధ్య­త­గా తీ­సు­కో­వా­ల­ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి పి­లు­పు­ని­చ్చా­రు. ఎక్క­డై­నా మహి­ళ­ల­పై వే­ధిం­పు­లు జరి­గి­తే చూసి చూ­డ­న­ట్లు ఉం­డ­టం కూడా నే­రా­న్ని ప్రో­త్స­హిం­చ­డ­మే­న­ని ఆయన హె­చ్చ­రిం­చా­రు. కా­లే­జీ­లు, బస్టాం­డ్లు, పబ్లి­క్ ప్ర­దే­శా­లు ఎక్క­డై­నా ఇలాం­టి ఘట­న­లు కని­పి­స్తే ప్ర­జ­లు ధై­ర్యం­గా ఎది­రిం­చా­ల­న్నా­రు. మహి­ళ­లు కూడా తమ హక్కుల కోసం ధై­ర్యం­గా ముం­దు­కు రా­వా­ల­ని సీఎం సూ­చిం­చా­రు. ఉద్యో­గా­లు, ఉపా­ధి అవ­కా­శా­ల­ను ధై­ర్యం­గా వి­ని­యో­గిం­చు­కో­వా­ల­ని, సమా­జం­లో తమ స్థా­నా­న్ని బల­ప­ర­చు­కో­వా­ల­ని ఆయన సూ­చిం­చా­రు. అభి­వృ­ద్ధి చెం­దిన దే­శా­ల్లో మహి­ళ­లు సైం­టి­స్టు­లు, డా­క్ట­ర్లు, ఇం­జ­నీ­ర్లు­గా రా­ణి­స్తు­న్నా­ర­ని గు­ర్తు చే­శా­రు. తె­లం­గా­ణ­లో కూడా మహి­ళ­ల­కు కీలక అధి­కార పద­వు­ల్లో అవ­కా­శా­లు కల్పి­స్తు­న్నా­మ­ని సీఎం చె­ప్పా­రు.

మహిళ దినోత్సవంతో బాధ్యత తీరిపోదు:సీఎం

మహి­ళల రక్షణ, అభ్యు­న్న­తి కోసం కే­వ­లం చట్టా­లు చే­య­డం మా­త్ర­మే సరి­పో­ద­ని, అవి క్షే­త్ర­స్థా­యి­లో సమ­ర్థ­వం­తం­గా అమలు చే­సి­న­ప్పు­డే ప్ర­భు­త్వాల అసలు బా­ధ్యత నె­ర­వే­రు­తుం­ద­ని తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి స్ప­ష్టం చే­శా­రు. మహి­ళల భద్రత, ఆర్థిక స్వా­వ­లం­బన, సా­మా­జిక గౌ­ర­వం కోసం రా­ష్ట్ర ప్ర­భు­త్వం అనేక చర్య­లు చే­ప­డు­తోం­ద­ని ఆయన తె­లి­పా­రు. మహి­ళ­ల­కు సమా­జం­లో సమాన అవ­కా­శా­లు కల్పిం­చ­డం మా­త్ర­మే కాదు, వా­రి­ని నా­య­క­త్వ స్థా­నా­ల­కు తీ­సు­కె­ళ్ల­డం కూడా ప్ర­భు­త్వ లక్ష్య­మ­ని ఆయన అన్నా­రు. శని­వా­రం హై­ద­రా­బా­ద్‌­లో­ని జే­ఎ­న్‌­టీ­యూ ఆడి­టో­రి­యం­లో ని­ర్వ­హిం­చిన ‘స్టాం­డ్ విత్ హర్’ కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­న్న సీఎం రే­వం­త్‌­రె­డ్డి మహి­ళా సా­ధి­కా­ర­త­పై వి­స్తృ­తం­గా మా­ట్లా­డా­రు.అభి­వృ­ద్ధి­లో మహి­ళల పా­త్ర కీ­ల­క­మ­ని సీఎం పే­ర్కొ­న్నా­రు. మహి­ళ­లు ఆర్థి­కం­గా, సా­మా­జి­కం­గా బల­ప­డి­తే­నే కు­టుం­బం బల­ప­డు­తుం­ద­ని అన్నా­రు.

Tags:    

Similar News